ఆధ్యాత్మిక చదువు అంటే మనిషి తన యొక్క సంపూర్ణతను తెలుసుకునే ప్రయత్నము. తనలోని చెడును వదలివేసి సంపూర్ణమైన మంచితో జీవించే ప్రయత్నము.ఇక్కడ కులములు, మతములు , దేముళ్ళు ,దేవతలతో, గ్రంధాలు , గురువులతో పని లేదు .ఈ చదువులో మహిమలు, మాయలు, అద్భుతాలు , మూఢ నమ్మకాలు వుండవు . ఈ చదువు పూర్తిగా వ్యక్తిగతము.కేవలము తన ఒక్కరికి మాత్రమే సంభందించిన అంశము ...మతములు - మార్గములు - గురువులు - గ్రంధములు అవి మనిషి భౌతిక జీవితమునకు సంభందించిన అంశములు .అక్కడ మీరు మీకు నచ్చినట్లు ఉండవచ్చు ..ఇక్కడ ఆధ్యాత్మిక చదువులో - ఆత్మజ్ఞాన చదువులో స్వీయ అంతరంగ చదువులో మాత్రము నువ్వే నీ సాధనకు మూలము ...సాధన సాధ్యము రెండూ నువ్వే ....కుల,మత, జాతి భేదములు లేకుండా మానవులు అందరికి సంభందించిన చదువు ఇది .మీ గూర్చి మీరు సంపూర్ణముగా తెలుసుకునే చదువు కనుక మీకు తప్పక మేలు జరుగుతుంది .... శుభం ....తన సంపూర్ణతను తాను తెలుసుకోవాలనుకునే వారికే -- తానూ మంచిగా మాత్రమే బ్రతకాలనుకునే వారికి మాత్రమె ఈ చదువు ఉపయోగపడుతుంది ....