ఊరిపై మాకున్న ప్రేమకు, బాధ్యతకు నిదర్శనమే ఈ Channel. గది ముందుకు ఊరిని తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. ఊరిలో లేకపోయినా.. ఇక్కడ జరిగే వేడుకల్ల్ని, అందరూ ఈ channel ద్వారా చక్కగా చూడొచ్చు. అనుభూతుల్ని పంచుకోవొచ్చు. జ్ఞాపకాల సరసుల్లో ఈదులాడొచ్చు. ఎవరెవరు.. ఎక్కడెక్కడ.. ఏ స్థాయిలో ఉన్నా మనం అనే భావనను మనసుల్లో నుంచి చెదిరిపోకుండా చేయాలన్నదే దీని ఉద్దేశం.
మన ఊరు అనే తల్లి వేరు బంధం తెగిపోకుండా కాపాడటమే దీని లక్ష్యం... 🙏