Amaravati Farmers Protest is Historical | Chandrababu

Описание к видео Amaravati Farmers Protest is Historical | Chandrababu

600రోజుల అమరావతి రైతుల ఉద్యమం చారిత్రాత్మకమని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అభినందించారు. జగన్ రెడ్డి చేస్తున్న దాడి అమరావతిపై కాదన్న అయన యావత్ రాష్ట్ర సంపద సృష్టిపై దాడి అని అన్నారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంపై మండిపడ్డారు. ఉద్యమాన్ని అణచాలని చూసినా.... మొక్కవోని దీక్షతో రైతులు చేసిన ఉద్యమం......చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అమరావతి నిర్మాణానికి 32వేల 323 ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారని గుర్తు చేశారు. వారిచ్చిన భూమిలోనే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగులకు ఇళ్లు నిర్మించామని తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్, నేల పటుత్వం లేదని, ముంపు ప్రాంతమని, అన్ని వర్గాల ప్రజలుంటే ఒక సామాజిక వర్గమే ఉందంటూ... రకరకాల అసత్య ప్రచారాలు చేశారని ధ్వజమెత్తారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా......... వైకాపా తప్పుడు ప్రచారం మాత్రం మానలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో రోడ్లకు వేసిన కంకరను దొంగతనంగా తవ్వుకుని, హైకోర్టు సమీపంలో ఇసుకను మాయం చేసే స్థితికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке