బండి సంజయ్ బయోగ్రఫీ | Bandi Sanjay Real Life Story | Biography | BJP National General Secretary Band

Описание к видео బండి సంజయ్ బయోగ్రఫీ | Bandi Sanjay Real Life Story | Biography | BJP National General Secretary Band

BJP Telangana Chief Bandi Sanjay Kumar Biography
#BandiSanjay #BJP #Lifestories

Bandi Sanjay Kumar appointed BJP's national general secretary.

బండి సంజయ్ కుమార్ ( జననం: 1971 జూలై 11) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. కరీంనగర్ నియోజకవర్గ లోక్ సభ సభ్యుడు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు.

జననం: జూలై 11, 1971
వృత్తి: పార్లమెంట్ సభ్యుడు, కరీంనగర్‌
జీవిత భాగస్వామి: అపర్ణ
పిల్లలు: భగీరథ్, సుముఖ్‌
తల్లిదండ్రులు: శకుంతల, నర్సయ్య

ఈయన 1971 జులై 11న శకుంతల, నర్సయ్య దంపతులకు జన్మించాడు. బండి సంజయ్ నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేసేవాడు. సంజయ్ ను తన తండ్రి ఒకటో తరగతిలోనే సరస్వతి శిశుమందిర్‌ లో చేర్పించాడు, అప్పటినుండే అయన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బండి సంజయ్ ఆర్‌ఎస్‌ఎస్‌లో ఘటన్‌ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశాడు. 1996లో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సురాజ్‌ రథయాత్ర సమయంలో అప్పటి మెట్‌పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు, బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు ఆయనను అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్‌చార్జిగా నియమించారు.

ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్‌ను ఢిల్లీ సెంట్రల్‌ ఆఫీస్‌లో సహాయక్‌గా నియమించారు

బండి సంజయ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP)లో కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగానూ బాధ్యతలు నిర్వర్తించాడు. 1994-2003 మధ్యకాలంలో ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా పనిచేశాడు. భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పార్టీలో పని చేశాడు. అనంతరం భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు ఇంచార్జి‌గా బాధ్యతలు నిర్వహించాడు.

2005 లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థ‌కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ మూడుసార్లు గెలిచాడు. సంజయ్ రెండు పర్యాయాలు కరీంనగర్ బిజెపి అధ్యక్షునిగా పనిచేశాడు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు, 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ పై 14,000 పైగా ఓట్ల తేడాతో తో ఓడిపోయాడు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బి.వినోద్‌ కుమార్‌పై 89508 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[3] బీజేపీ హైకమాండ్ ఆయనను 2020 మార్చి 11న తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా నియమించింది.


Download Our Made in India Short Video App - Jalsa: https://bit.ly/3eMtY6R
Download Our Aadhan App From Here:
Android: https://bit.ly/2leHJnn
IOS : https://apple.co/2yZhbxb
All you need to do is hit the "SUBSCRIBE" button and stay tuned to our Non-stop Fun/Entertainment video channel

Please Like, Share and Comment in Comment Box

For More Telugu Songs and Short Films and Interesting Videos

visit :    / aadhantelugu  
Website : https://www.aadhan.in
Facebook :   / aadhantelugu  
Twitter :   / aadhantelugu  
Pinterest :   / aadhantelugu  

SUBSCRIBE Aadhan Channels For Interesting Videos

For Adhyatmika :    / aadhanadhyatmika  
For Aaharam & Viharam:    / aadhanfoodtravel  

Thank you for watching.

Комментарии

Информация по комментариям в разработке