Gam Gam Gam Ganapati Song | Ganesh Chaturdi Telugu Song | Swara Music| Swaraag | Srinivasa Sarma

Описание к видео Gam Gam Gam Ganapati Song | Ganesh Chaturdi Telugu Song | Swara Music| Swaraag | Srinivasa Sarma

Ganesh Chavithi (Chaturdi) Special Telugu Song by Swara Music

విజయాల నాయకా!
విఘ్నవినాయకా! జై!
జగమంతా వేడుక
జనమంతా పాడగా జై!
వాడ,వాడల నీకే మొక్కినాముగా
తోడై ఉండవా తొండం సామీ
గల్లీ,గల్లికి కదం తొక్కినాముగా
మదినిండా మారాజా నిన్నే నమ్మి
గం గం గం గణపతి
నువ్వే మా దళపతి
తొలిపూజ నీకేలే ఏరోజైనా
గం గం గం గణపతి
నువ్వేలే మా గతి
లోకాన్నే దీవించు ఏదేమైనా..

చ:
ఏకదంతుడా ఏకం చేయవా
మాలో తేడాలు మాయం చేసి
బొజ్జ నిండుగా చదువే నింపవా
బుద్ధి లోపాలే మాలో తీసి
నింగీ, నేలా నిన్నా, రేపూ
మొత్తం నువ్వే నవ్వై రావా
గండాలకే తొండం అడ్డేసి
జగమంతా చింత తీర్చాలంట
నువ్వే చెంత చేరాలంట
అండ దండ అన్నీ నువ్వై
ఆనందాలే నిండాలంట ||గం గం గం||

చ:
మాటే చాలనీ, మట్టే మేలనీ
నేల మీదంత గారాబమై
గడ్డిపరకనీ, కాసిన పువ్వునీ
ఇస్తే చాలంట వైభోగమై
అమ్మ,అయ్య చుట్టే చుట్టి
అండపిండ బ్రహ్మాండమై
ఉండావంట నీదే గొప్పంతా
ఎలుకెక్కావంటే ఒకటే లెక్క
చిన్నాపెద్దా లేదే పక్కా
వచ్చీరాని పూజే చేసే
మాదే పుణ్యం మనసున్నంత ||గం గం గం||

-నాగగురునాథ శర్మ.

Credits:

"GAM GAM GAM GANAPATI" song.

1. Music Director - Srinivas Sharma

2. Singer - Swarag Keerthan

3. Keyboard Programmed by - Jai Prakash

4. Flute - Raghava Sai

5. Chorus:

i. Meghana Naidu
ii. Sahiti Adapa
iii. Sumanas Sarma

6. Mixing & Mastering - Suresh Mallavarapu

7. Studio - Anwika Studios

Lyricist:

Name: Madugula Naga Gurunatha Sarma

Design: & VFX : Vikram & Vikranth

Producers :-

Raj Yakkali
Rao TP
Dr Venu Kondle

Production : Swara Music

Комментарии

Информация по комментариям в разработке