కేయూరాణి న భూషయంతి శ్లోకం

Описание к видео కేయూరాణి న భూషయంతి శ్లోకం

#ఆకాశవాణి రేడియో ప్రసారాలలో #అమరవాణి పేరుతో #సంస్కృత పాఠం కార్యక్రమానికి ఆరంభంలో వచ్చే శ్లోకం ఇది.
#కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలాః,
#న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః,
#వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే,
#క్షీయంతే౭ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం.
మనిషికి మంచి వాక్కు మాత్రమే నిజమైన శోభనిస్తుంది. ఇతర భూషణాలు ,లేపనాలు ,పువ్వులు తాత్కాలికమైన శోభనిస్తాయి.కాబట్టి #మంచివాక్కు ఒక్కటే మనిషికి #నిజమైనాలంకారం.

   • అందరినీ మీ‌స్నేహితులే అనుకుంటున్నారాక...  

సహితయోః శబ్దార్థయోః భావః #సాహిత్యం అని సాహిత్యానికి నిర్వచనం . హితమును చేకూర్చే అనగా మంచిని కలుగజేసే శబ్దార్థాల కలయికే సాహిత్యం. ఎవరికి హితాన్ని కలిగిస్తుంది అంటే సమాజానికి హితాన్ని కలిగిస్తుంది. సమాజం అంటే మనమే. మనిషి జీవితాన్ని ఆనందంగా గడపడానికి కావలసిన నైతిక విలువలను, సూచనలను, స్ఫూర్తిని, ధైర్యాన్ని, విచక్షణా జ్ఞానాన్ని సాహిత్యం అందిస్తుంది.
కౌముది అంటే వెన్నెల. ప్రకాశాన్ని, ఆహ్లాదాన్ని కలిగించడం కౌముది లక్షణం. ప్రకాశం అంటే వెలుగు. వెలుగు జ్ఞానానికి ప్రతీక. ఆహ్లాదం అంటే ఆనందం. సాహిత్యం జ్ఞానాన్ని ఆనందాన్ని కలిగించేది కాబట్టి మన ఛానల్ కు సాహితీ కౌముది అనే పేరును నిర్ణయించాము.
#ప్రాచీనం నుండి #ఆధునికం వరకు #మహాకవులకలాల నుండి జాలువారిన #సాహిత్యగంగ సహృదయుల హృదయాలలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. సంస్కృతాంధ్ర సాహిత్యాలలో ఉన్న అనేక అనేకానేక అంశాలను, #ఆధ్యాత్మిక విషయాలను ప్రస్తావిస్తూ బాలలనుండి పెద్దల వరకు అందరికీ ఆనందాన్ని కలిగించేలా ఈ ఛానల్ ని రూపుదిద్దాలనే నిబద్ధతతో ఉన్నాము.
దీనికి అమూల్యమైన మీ సహకారాన్ని అందించి ఛానల్ ను ముందు నడిపిస్తారని నన్ను ప్రోత్సహిస్తారని అభిలాషిస్తూ...

మీ
బులుసు అపర్ణ శతావధాని

Комментарии

Информация по комментариям в разработке