Narayana Swamy Devasthanam | Mittapalem | Prakasam District

Описание к видео Narayana Swamy Devasthanam | Mittapalem | Prakasam District

#VamsiBudgetTraveller #NarayanaSwamyDevasthanam #Mittapalem.

Address :- Mittapalem Village,
:- CS Puram Mandalam,
:- Prakasam District.

శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానం మిట్టపాలెం అనే గ్రామంలో ఒక సర్వసంగ పరిత్యాగి అయిన నారాయణ స్వామి సజీవ సమాధి మీద నిర్మింపబడి పూజలందుకుంటున్న ఆలయం. మిట్టపాలెం గ్రామంలో 17 వ శతాబ్దంలో జన్మించిన కొండయ్య అనే అతను దగ్గరలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతం అయిన నారకొండలు లో తపస్సు చేసుకుంటూ ఒక మహనీయుడు ద్వారా మంత్రోపదేశం పొంది నారాయణ స్వామి వారిగా మారి, ఇక్కడి ప్రజల్లో శాంతి సామరస్యాలు నెలకొల్పి అందరినీ సన్మార్గంలో నడిచే విధంగా బోధనలు చేస్తూ. తమ మహిమలతో వారిని కాపాడుతూ తమ 32 సంవత్సరాల వయసులో మిట్టపాలెం గ్రామంలో సజీవ సమాధి చెంది తన దగ్గరకు వచ్చే భక్తులను తన సమాధి నుండే అనుగ్రహిస్తాను అని చెప్పి సజీవ సమాధి చెందారు. ఇప్పుడు మనం చూస్తున్న నారాయణ స్వామి వారి ఆలయం ఆ సజీవ సమాధి మీద నిర్మించినదే. ఇక్కడ ప్రతి ఆదివారం వందలాది మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుని ఇక్కడే నిద్ర చేసి వెళ్తుంటారు. ముఖ్యంగా చర్మ రోగాలతో ఎక్కువగా బాధపడుతున్న వారు ఇక్కడ స్వామి వారి అభిషేక జలాన్ని విభూతి తో కలిపి రాసుకుంటే నయమవుతుంది అని భక్తుల నమ్మకం. ఇక్కడ మహాశివరాత్రి కి తిరునాళ్ళ ఎంతో బాగా జరుగుతుంది, ఈ నారాయణ స్వామి వారి ఆలయంలో మనకి దాదాపు గా అన్ని రకాల వసతి సౌకర్యాలు దేవస్థానం వారు ఏర్పాటు చేశారు.

జై జవాన్ - జై కిసాన్

Комментарии

Информация по комментариям в разработке