వంకాయ డం బిర్యానీ | Vankaya Dum Biryani | Vankaya Biryani | Brinjal Biryani | Veg Biryani Recipe @HomeCookingTelugu
#vankayabiryani #dumbiryani #vegbiryani #brinjalbiryani #hemasubramanian #homecookingtelugu #vankayadumbiryani
Our Other Biryani Recipes :
Gongura Chicken Biryani: • గోంగూర చికెన్ బిర్యానీ | Gongura Chicken B...
Vegetable Dum Biryani: • తాజా కూరగాయలతో ఘుమఘుమలాడే వెజ్ దమ్ బిర్యాన...
Paneer Biryani: • Paneer Biryani | పనీర్ బిర్యానీ | Paneer B...
Chicken Tikka Biryani: • పక్కా కొలతలతో రెస్టారెంట్ స్టైల్ చికెన్ టి...
Hyderabadi Mutton Dum Biryani: • హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ | Hyderabadi M...
Chittimuthyalu Mutton Biryani: • చిట్టిముత్యాలు మటన్ బిర్యానీ | Chitti Muth...
Mirchi Ka Salan: • మిర్చీ కా సాలన్ | Mirchi Ka Salan | Sidedi...
Brinjal Gravy: • బిర్యానీ వంకాయ గ్రేవీ | Biryani Brinjal Gr...
Chapters:
Promo - 00:00
Brinjal Marinade - 00:24
Brinjal Gravy - 01:15
Cook Basmati Rice - 03:00
Layer biryani - 03:45
కావాల్సిన పదార్ధాలు :
పెరుగు - 400 గ్రాములు
పసుపు - 1 / 2 టీస్పూన్
కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి - 1 1 / 2 టీస్పూన్
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
గరం మసాలా - 1 1/2 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
వంకాయలు - 1 / 2 కేజి
వేయించిన ఉల్లిపాయలు
పుదీనా ఆకులు
కొత్తిమీర
నూనె - 2 టేబుల్స్పూన్లు
నేయి - 2 టేబుల్స్పూన్లు
మసాలా దినుసులు
( బిర్యానీ ఆకు , లవంగాలు , జాపత్రి ,
షా జీరా , దాల్చిన చెక్క , అనాస పువ్వు ,
యాలకులు , రాతిపువ్వు , మిరియాలు )
తరిగిన ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లులి పేస్ట్ - 1 టీస్పూన్
పచ్చిమిరపకాయ పేస్ట్ - 1 టీస్పూన్
కొబ్బరి పొడి - 1 టేబుల్స్పూన్
జీడిపప్పు పొడి - 1 టేబుల్స్పూన్
బాస్మతి బియ్యం - 300 గ్రాములు
నానపెట్టిన బాస్మతి బియ్యం
ఉప్పు - 1 టీస్పూన్
మసాలా దినుసులు
( దాల్చిన చెక్క , లవంగాలు , యాలకులు ,
అనాస పువ్వు , బిర్యానీ ఆకు , షా జీరా )
కుంకం పువ్వు నీళ్ళు - 3 టీస్పూన్లు
నెయ్యి - 3 టీస్పూన్లు
వేయించిన ఉల్లిపాయలు
తరిగిన కొత్తిమీర
పుదీనా ఆకులు
తయారీ విధానం :
ముందుగా వంకాయలను మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం ఒక గిన్నెలో మూడు వందల గ్రాములు పెరుగు , అరా టీస్పూన్ పసుపు , రెండు టీస్పూన్లు కాశ్మీరీ కారం , ఒకటిన్నర టీస్పూన్ జీలకర్ర పొడి , రెండు టీస్పూన్లు ధనియాల పొడి , ఒకటిన్నర టీస్పూన్ గరం మసాలా , ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
తరువాత అరా కిలో వంకాయలు , వేయించిన ఉల్లిపాయలు , గుప్పేడు పుదీనా ఆకులు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఇరవై నిముషాలు మ్యారినేట్ చేసుకోవాలి.
తరువాత ఒక పెద్ద కడై లో రెండు టేబుల్స్పూన్లు నూనె , రెండు టేబుల్స్పూన్లు నెయ్యి , మసాలా దినుసులు ( బిర్యానీ ఆకు , లవంగాలు , జాపత్రి , షా జీరా , దాల్చిన చెక్క , అనాస పువ్వు , యాలకులు , దగాడ పువ్వు / రతి పువ్వు , మిరియాలు ) వేసుకోవాలి.
తరువాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరుకు వేయించుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు రెండు మరీనా తరువాత ఒక టీస్పూన్ అల్లం వెల్లులి పేస్ట్ , ఒక టీస్పూన్ పచ్చిమిరయాకాయ పేస్ట్ వేసి కలుపుకొని మ్యారినేట్ చేసిపెట్టుకున్న వంకాయలు పెరుగు మిశ్రమం తో పటు వేసుకొని కలిపి మూత పేటి ఐదు నిముషాలు కుక్ చేసుకోవాలి.
ఐదు నిముషాలు తరువాత మూత చేసి ఒకసారి కలుపుకొని ఒక టీస్పూన్ కొబ్బరి పొడి , ఒక టీస్పూన్ జీడిపప్పు పొడి వేసి కలుపుకొని మూత పేటి మరో పది నిముషాలు ఉడికించుకోవాలి.
పది నిముషాలు తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
తరువాత ఒక గిన్నె లో నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి , అందులోకి మూడు వందల గ్రాములు కడిగి అరగంట నానపెట్టుకున్న బాస్మతి బియ్యం , ఒక టీస్పూన్ ఉప్పు , మసాలా దినుసులు ( దాల్చిన చెక్క , లవంగాలు , యాలకులు , అనాస పువ్వు , బిర్యానీ ఆకు , షా జీరా ) వేసుకొని మూత పేటి ఐదు నిముషాలు ఉడికించుకోవాలి.
ఐదు నిముషాలు తరువాత అన్నం వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
తరువాత ఒక కడై లో వంకాయ మసాలా వేసి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి దాని పైన ఉడికించుకున్న బాస్మతి అన్నం వేసి సమానంగా లేయర్ లాగా పరుచుకోవాలి.
దాని పైన మూడు టేబుల్స్పూన్లు కుంకం పువ్వు నీళ్ళు , మూడు టీస్పూన్లు నెయ్యి , గుప్పేడు వేయించుకున్న ఉల్లిపాయలు , తరిగిన కొత్తిమీర , పుదీనా ఆకులు వేసి స్టవ్ పైన పెట్టుకొని ఆవిరి బయటికి పోనీ మూత పేటి పదిహేను నిముషాలు డం కుక్ చేసుకోవాలి.
పదిహేను నిముషాలు తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
ఐదు నిముషాలు తరువాత మూత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ ఐనా వంకాయ డం బిర్యానీ రెడీ.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
You can buy our book at https://shop.homecookingshow.in/
Follow us :
Facebook- / homecookingtelugu
Youtube: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : http://www.ventunotech.com
Информация по комментариям в разработке