Dharmavaram Weavers |Cracked Down Kanchi Pattu Saree Secret | Special Story

Описание к видео Dharmavaram Weavers |Cracked Down Kanchi Pattu Saree Secret | Special Story

మగువకు అందాన్నీ.. నిండైన హుందాతనం ఇవ్వటంలో పట్టు చీర తరువాతే ఇతర వస్త్రాలు. దేశవ్యాప్తంగా పట్టుచీరల విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఓ పేరు, గొప్పతనం ఉంది. కంచి పట్టు విషయంలో ఆ ప్రత్యేకత వేరే వివరించనవసరం లేదు. దేశంలో ఏ మగువను అడిగినా ఇట్టే చెబుతా రు కంచిపట్టు గురించి. ఎవరు కట్టుకున్నా నిండుగా ఇమిడిపోవటమే కంచి పట్టుకున్న ప్రత్యేకత. బంగారు, వెండి, రాగి జరీలతో.. దీపపు కాంతుల్లో ధగాధగా మెరిసిపోయే కంచిపట్టు ఏ శుభకార్యం జరిగినా సందడి చేస్తుంది. ఆ వెలుగులు ఇష్టపడని అతివలు ఉండరు. చీరకట్టు భారతీయ సంప్రదాయం అయితే.. ఆ చీరల్లో రారాణి కంచిపట్టుచీర. అలాంటి కంచిపట్టును ధర్మవరం నేతన్నలు పట్టేశారు. ఇన్ని రోజులు తమ హస్త కళానైపుణ్యంతో ప్రపంచ ఖ్యాతి గడించిన ధర్మవరం నేతన్నలు.. ఏకంగా కంచిపట్టు తీసుకొచ్చి....మరింత మెరుగులు అద్దుతున్నారు. మన్నిక, నాణ్యతలో రాజీ పడకుండా ఆకట్టుకుంటున్నారు.





#IdiSangathi

Комментарии

Информация по комментариям в разработке