తిరుపతి బాలాజీ నుంచి రక్తం ధార ఎందుకు వచ్చింది ? HG Maha Vishnu Dasa

Описание к видео తిరుపతి బాలాజీ నుంచి రక్తం ధార ఎందుకు వచ్చింది ? HG Maha Vishnu Dasa

తిరుపతి బాలాజీ నుంచి రక్తం ధార ఎందుకు వచ్చింది ? HG Maha Vishnu Dasa

అలంకార ప్రియో విష్ణుః” అన్నట్లు విష్ణుదేవుడు అలంకారప్రియుడు, విశేషించి
పుష్పాలకంరణ ప్రియుడు.
తిరుమలలో ఆనాటి పరిస్థితులు నివాసయోగ్యంగా ఉండకున్నా, గుర్వాజ్ఞను
శిరసావహించి పుష్పకైంకర్యానికి సిద్ధపడి, తిరుమలను పుష్పోద్యాన మండపముగ చక్కగ
తీర్చిదిద్దిన శ్రీమాన్ అనంతాళ్వాన్ వారిని కీర్తించడానికి మాటలు చాలవు.
దేవుని దివ్య చరణ సన్నిధికి, శిష్యుని చేర్చువాడే అసలైన సద్గురువు. అందుచే
శ్రీమాన్ అనంతాళ్వాన్ వారు, దేవుని కంటే గురువే ముఖ్యమని భావించి తదనుగుణముగా
ప్రవర్తించిన సందర్భాలు కోకొల్లలు.
ప్రథమం గురుకార్యం చ
దైవకార్యం ద్వితీయకమ్
అని శ్రీమలయాళ సద్గురు స్వామి చెప్పినట్లు గురుకార్యానికి ప్రాముఖ్యమిచ్చిన
మహనీయుడు శ్రీమాన్ అనంతాళ్వాన్నారు.
చీమల గుంపును తిరుమల నుండి దూరం చేయడం తగదని భావించిన ఈ
మహాత్మునకు తిరుమల పట్ల ఉన్న విశ్వాసమును, చీమల ఎడగల కరుణను ఏమని
కొనియాడగలము ?
అంతటి ఉదాత్త చరిత్రుడు కావడం వల్లనే శ్రీమాన్ అనంతాళ్వాన్వారు, సాక్షాత్
శ్రీమహాలక్ష్మిని పుత్రికగాను, శ్రీనివాసుణ్ణి అల్లుడుగాను పొందగలిగినారు. సామాన్యుల
కట్టి స్థితి సాధ్యంకాదు కదా!
అట్టి మహామహుని దివ్యమైన చరిత్రమును రచించే మహాభాగ్యం శ్రీపాలకొలను
వేంకట రామిరెడ్డి గారికి దక్కినది. ఈ రచనకు కర్తృత్వం వహించిన రెడ్డిగారే కాక,
ఇందుకు తగిన ప్రేరణ కల్గించిన శ్రీమాన్ అనంతాళ్వాన్ వారి 26 వ తరమునకు
చెందిన శ్రీమాన్ టి.ఏ.పి. రంగాచారి గారు కూడా, ఈ కైంకర్యంలో భాగస్వాములై
కృతకృత్యులయ్యారు.
#harekrishnagoldentemple
#govinda #tirupatibalaji
#hgmahavishnudasa

Комментарии

Информация по комментариям в разработке