Religion in Politics : Dr. Jayaprakash Narayan on the debate on religion || Dr. Jayaprakash Narayan

Описание к видео Religion in Politics : Dr. Jayaprakash Narayan on the debate on religion || Dr. Jayaprakash Narayan

#udayanidhistalin #dmk #jayaprakashnarayana #sanatandharma #loksatta
మత వ్యాఖ్యల వివాదం

మన దేశంలో మతమన్న మాట యధాలాపంగా వాడతాం గానీ వాస్తవంలో భారతీయ సంప్రదాయం అనేక విశ్వాసాలు, ధోరణుల సమాహారమని, వివిధ విశ్వాసాల మధ్య సంఘర్షణల్ని సమన్వయం చేస్తూ మనిషి ప్రవర్తనని సమాజహితం దిశగా నియంత్రించటంలో భారతీయ మతం గణనీయ విజయం సాధించిందని.. ఈ నేపథ్యంలో మతాల మధ్య ద్వేషాన్ని చూడటం, భావాల మధ్య ఘర్షణను విపరీతం చేయటం తగదని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.

అన్ని మతాల్లో మంచితో పాటు చెడు కూడా ఉందని, మన దేశంలో కుల వివక్ష తగ్గినా అభ్యుదయవాదులమనుకుంటున్నవారిలో కూడా అంతర్లీనంగా కులతత్వం ఇంకా కొనసాగుతోందని, ఈ పరిస్థితి మారాలంటే, కులమతాలు ఎన్నికల పాచికలుగా మారకూడదంటే.. మన ప్రభుత్వాలు విద్య, ఆరోగ్యం, చట్టబద్హపాలన వంటి అంశాల్లో తమ మౌలిక బాధ్యతను నెరవేర్చాలని, అధికారాన్ని వికేంద్రీకరించి ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, కులాన్ని సృష్టించిన సమాజం నుంచి వచ్చినవారుగా కులరహిత ఆదర్శం కోసం మనందరం కూడా చిత్తశుద్ధితో కృషి చేయాలని JP పేర్కొన్నారు.

Комментарии

Информация по комментариям в разработке