MRPS National Vice President Masaipet Yadagiri Madiga demanded the Telangana government....

Описание к видео MRPS National Vice President Masaipet Yadagiri Madiga demanded the Telangana government....

మాదిగల ఏబీసీడీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు మాసాయిపేట యాదగిరి మాదిగ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హవేలి ఘనపూర్ మండలకేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదో చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఫిబ్రవరి 7వ తేదీన లక్ష డప్పులు, వేల గొంతులతో హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతామని హెచ్చరించారు. ఆలోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయాలని డిమండ్ చేశారు.లేనిపక్షంలో హైదరాబాద్ లో జరిగే లక్ష డప్పులు, వేల గొంతులతో జరిగే ఉద్యమం ఉదృతమైతే జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మురళి, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మలిశెట్టి రవి, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు మస్కూరి కిరణ్, శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు.

Комментарии

Информация по комментариям в разработке