కుప్పంలో వన మహోత్సవ కార్యక్రమం - ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

Описание к видео కుప్పంలో వన మహోత్సవ కార్యక్రమం - ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

Vana Mahotsavam programme in Kuppam
#vanamahotsavam #chittoorcollector #kada #kancharlasrikanth #sumitkumar #vikasmarmat #kuppamforest
కుప్పం మండల పరిధిలోని నడుమూరు సమీపంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, KADA ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మరమ్మత్, ఐఎఫ్ఎస్సి సుమన్, టిడిపి నియోజకవర్గ అధ్యక్షులు పిఎస్ మునిరత్నం తదితరులు పాల్గొని అటవీ శాఖ అధికారులు ప్రదర్శించిన ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క విషయంలోనూ ఒక విజయంతో ముందుకు వెళ్తున్నారని ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సమాజాన్ని మార్చగలం అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు గతంలో శ్రమదానం జన్మభూమి అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని ప్రభుత్వ సహకారంతో మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలని బాధ్యత ప్రతి పౌరుడికి రావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే అంశాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి హరిత ఆంధ్రప్రదేశ్కు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కుప్పం ఇంచార్జ్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పుల్లో కాలుష్యం ఒకటని ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ చైతన్య తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అటవీశాఖ అధికారులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు

Комментарии

Информация по комментариям в разработке