సమస్యల వలయంలో సరస్వతి నిలయం

Описание к видео సమస్యల వలయంలో సరస్వతి నిలయం

కొడంగల్ : సమస్యల వలయం లో యున్నా, తమ సరస్వతి నిలయం కు, సంబదిత అధికారులు సత్వర మే స్పందించి, విముక్తి కల్పించాలని వికారాబాద్ జిల్లా, కొడంగల్ పురపాలక కేంద్రం లోని MJPTBCWRS అధ్యాపకులు మరియు విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.సు శిక్షుతులు మరియు అంకిత భావం కల్గిన, అధ్యాపకుల అహర్నిశ కృషి వల్ల, ఇటు చదువు లో, అటు క్రీడల్లో, పాఠశాల విద్యార్థులు రాణిస్తూ, రాష్ట్రం లోనే కొడంగల్ పురపాలక కేంద్రం లో యున్న MJPTBCWRS కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.ఈ పాఠశాల లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ కల్పి, మొత్తం 30 సిబ్బంది ఉండగా, వివిధ తరగతులలో 430 మందివిద్యార్థులు విద్యనబ్యసిస్తున్నారు.
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శంకర్ ఆధ్వర్యంలో,పాటశాల విద్యార్థులకు చదువు తో పాటు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యం తో వినూత్న రీతిలో, ఏ పాటశాలలో, లేని విధంగా, ప్రతి శనివారం, ఒక అంశం పై, అధ్యాపకులు అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.దింతో కార్పోరేట్ పాఠశాల లకు ధీటుగా ఉత్థిర్ణత లో, పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రం లోనే పాఠశాల కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అదే విధంగా చదువు లోనే కాక పాఠశాల విద్యార్థులను క్రీడల్లో సైతం ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో అధ్యాపక బృందం తీర్చి దిద్దగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గురుకులాల్లో, పాఠశాల కు పరుగు పందెం క్రీడల్లో మొదటి స్థానం దక్కింది.ఇలాంటి సరస్వతి నిలయం...సరైన వసతులు లేక సమస్యల వలయం లో చిక్కు కొని కొట్టు మిట్టాడుతుంది. ఈ గురుకుల పాటశాలలో ప్రధానంగా విద్యార్థుల కు సరిపడ 1) భోజనాలయం 2) మరుగు దొడ్లు లేవు.3) అలాగే అంత రాష్ట్ర రహదారి నుండి పాఠశాల వరకు అసంపూర్తిగా రహదారి నిర్మాణం చేపట్టడం తో కంకర తేలి...,4) రహదారి కి ప్రక్కన వీధి లైట్లు లేక రాత్రి వేళ రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కల్గుతుంది.
కావున ఇట్టి విషయ మై సత్వర మే సంభందిత అధికారులు స్పందించి పై సమస్యల వలయం లో యున్నా, తమ సరస్వతి నిలయం కు విముక్తి కల్పించాలని ముక్త కంఠం తో అధ్యాపక మరియు అభ్యసకా బృందం విజ్ఞప్తి చేశారు.

Комментарии

Информация по комментариям в разработке