Dattatreya Temple Seems to be in an Island | ద్వీపంలో చిక్కుకున్న వరదవెల్లి దత్తాత్రేయ ఆలయం

Описание к видео Dattatreya Temple Seems to be in an Island | ద్వీపంలో చిక్కుకున్న వరదవెల్లి దత్తాత్రేయ ఆలయం

మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురై చుట్టూ నీరు చేరడంతో... సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై వెలసిన దత్తాత్రేయస్వామి ఆలయం ద్వీపంలా మారింది. ఈ దృశ్యం భక్తులు, పర్యాటకులు, చూపరులను ఆకట్టుకుంటుంది. అయితే... గుట్టచుట్టూ జలాశయం వెనుక జలాలు చేరడంతో స్వామివారికి నిత్యపూజలు నిలిచిపోయాయి. జయంత్యుత్సవాల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి 27వరకు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ భక్తబృందం బోటు సదుపాయం కల్పించింది. ఏటా మూడు రోజులు నిర్వహించే దత్తాత్రేయస్వామి జయంత్యుత్సవాలు నేటితో ముగియనున్నాయి. మధ్యమానేరు జలాశయం నిర్మాణంలో భాగంగా 2016లో వరదవెల్లి గ్రామం ముంపునకు గురైంది. అప్పటి నుంచి ఆలయం ఉన్న గుట్టను బ్యాక్ వాటర్ చుట్టుముట్టింది. 40ఏళ్లకు పైగా ఉత్సవాలు చేసుకుంటూ వస్తున్న భక్తులకు.... 2016 నుంచి ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ముంపునకు గురైనప్పటి నుంచి భక్తులు బోటు సహాయంతో ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా గుట్టు చుట్టూ నీరు చేరడం, పచ్చదనం సంతరించుకోవడంతో ద్వీపంలా మారింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке