ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తం | Delhi Airport Roof Collapses Amid Heavy Rain

Описание к видео ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తం | Delhi Airport Roof Collapses Amid Heavy Rain

రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు............ దేశ రాజధాని దిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఐటీవో వద్ద రోడ్లపై మోకాళ్ల లోతు వర్షపు నీరుచేరి వాహనాలు ముందుకు కదల్లేదు. యమునానగర్ వద్ద........... కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. అరబిందో రోడ్ , గోవిందపురి, తీన్ మూర్తి మార్గ్ ... చెరవులను తలపించాయి. మింటో రోడ్డులో... ఓ ట్రక్కు పూర్తిగా నీట మునిగింది. చాలా మంది పాఠశాల విద్యార్థులు... ఇళ్లకే పరిమితమయ్యారు. మూల్ చంద్ ఏరియాలో.. అంబులెన్సు సహా కొన్ని వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. సాకేత్ మెట్రో వద్ద వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. చాలా కాలనీల్లో........ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల్లో సఫ్దార్ జంగ్ వద్ద......... దాదాపు 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు........... వాతావరణ విభాగం తెలిపింది. అటు.... దిల్లీ విమానాశ్రయం ఒకటో టెర్మినల్ పైకప్పు కూలగా ఓ వ్యక్తి చనిపోయాడు. మరో నలుగురు గాయపడ్డారు. పైకప్పు కింద ఉన్న కార్లు... పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకున్న దిల్లీ అగ్నిమాపక దళం సహాయ చర్యలు చేపట్టింది. టెర్మినల్ 1 నుంచి.. అన్ని విమాన సర్వీసులను నిలిపేసిన అధికారులు రెండు మూడో టెర్మినల్స్ కు మార్చారు. అటు విమానాశ్రయంవద్ద పరిస్థితిని పరిశీలించిన..... పౌర విమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.......... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు తెలిపారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке