మన ఆంధ్రప్రదేశ్ కు అదొక్కటే మూలాధారం. అన్ని కూడా దానిపైనే ఆధారపడి ఉన్నాయ్. అదే బడ్జెట్. బడ్జెట్ అనేది మన నవ్యఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతుంది. మరి ఈ బడ్జెట్ లో ఎంత వరకు హెచ్చుతగ్గులున్నాయి?. బడ్జెట్ విషయంలో కేంద్రం మన రాష్ట్రానికి ఎంతవరకు న్యాయం చేస్తుంది?. మన నాయకులు రాష్ట్రాన్ని ఏమేరకు అభివృద్ధి చేస్తున్నారు?. ప్రస్తుతం మనం సింపుల్ గా బడ్జెట్ మీద ఒక ఎస్టిమేషన్ వేసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన దగ్గర నుండి.. అంటే 2014 వ సవత్సరం నుండి 2019 బడ్జెట్ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. అందులోని హెచ్చుతగ్గులెంత? అప్పటి బడ్జెట్ , ఇప్పటి బడ్జెట్ ని Comparison చేసుకుంటే ఎంత మేరకు బడ్జెట్ అనేది పెరిగింది?.. అనే విషయాలు మీ cv9 ఛానల్.. మీకందిస్తుంది .
ప్రజల యొక్క సంక్షేమాన్నీ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం ఎన్నో పథకాల్నీ, కార్యక్రమాల్నీ అమలు చేయడం రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఈ బడ్జెట్ అనేది ఉండాలి.
నెంబర్ 1. 2014-15.
2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను.. అప్పటి ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు.
పాయింట్ కి వస్తే.. 2014-15 బడ్జెట్ 1,11,823 కోట్ల రూపాయాలు ప్రవేశపెట్టారు.
ఈ 1,11,823 కోట్ల రూపాయాలు ఒక్కో విభాగానికి ఒక్కో విదంగా విభాగించారు.
బడ్జెట్ విభాగంలో మనం ప్రధానంగా ఉండే అంశాల గురించి చర్చించుకుందాం.
ఇక్కడ మనం మొత్తంగా చూసుకుంటే అన్నిరకాల పెన్షన్ లకి వచ్చేసరికి..( 1044 ) ఒక వెయ్యి నలభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు. ఎన్టీఆర్ సుజల తాగునీటికి 5.4 కోట్ల రూపాయలు కేటాయించారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు 69.5 కోట్లు , రైతు రుణమాఫీ కి వచ్చేసరికి 5 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికోసం 2657 కోట్లు,గ్రామీణ పేదప్రజల మాగృహనిర్మాణాలకోసం 808 కోట్లు,రోడ్లు మరియు భవనాల శాఖకు 2612 కోట్లు, సాగునీటి రంగానికి 8465 కోట్ల రూపాయలు కేటాయించారు.
2014-15 సంవత్సరానికి ఆర్థిక లోటు వచ్చి 12,064 కోట్లు.
నెంబర్ 2. 2015-16 AP బడ్జెట్.......
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను.. 1,13,049 కోట్ల రూపాయలు ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు.
గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్ 1226 కోట్లు ఎక్కువే .
అయితే కొన్ని కొన్ని విభాగాలకు మాత్రం ఈ బడ్జెట్ నీరు కార్చిందనే చెప్పుకోవచ్చు.
ఇందులో ముఖ్యంగా రైతు రుణమాఫీకి వచ్చి కేవలం 4,300 కోట్ల రూపాయలతో మాత్రమే సరిపెట్టారు. అంటే గత బడ్జెట్ తో పోలిస్తే.. 700 కోట్లు తక్కువ.
నెంబర్ 3. 2016-17 AP బడ్జెట్.......
2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను.. AP వార్షిక బడ్జెట్ వచ్చేసరికి 1,35,688 కోట్ల రూపాయలు కేటాయించారు.
2014-15 బడ్జెట్ తో పోలిస్తే 2016-17 బడ్జెట్ 20 శాతం పెరిగింది.
ఆర్థిక లోటు రూ. 20,497 కోట్లు.
నెంబర్ 4. 2017-18 AP బడ్జెట్.......
2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను.. 1,56,990 కోట్ల రూపాయలు
కేటాయించారు.
గత బడ్జెట్ తో పోల్చుకుంటే ఈ బడ్జెట్ 15% ఎక్కువే.
మరి ఈ బడ్జెట్లో కొన్ని నూతన పధకాలు అనేవి తీసుకురావడం జరిగింది.
వ్యవసాయ అభివృద్ధి రంగానికి 9091 కోట్లు ,గ్రామీణ అభివృద్ధికి 19,565 కోట్లు,sc లకు ఉచిత విద్యుత్ 50 యూనిట్ల నుంచి 75 యూనిట్లకు పెంచారు . ఎన్టీఆర్ జలసిరి కింద 1,24,349 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఈ బడ్జెట్ లో త్రాగునీటి ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ఎన్టీఆర్ క్యాటిన్లకు 200 కోట్లు కేటాయించారు.
దీనిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే రెండేళ్లలో పది లక్షల గృహాలు పూర్తి చేయాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది. మరి.. వారనుకుంది సక్రమంగా పూర్తయ్యిందా? లేక మధ్యలోనే ఆపేశారా? ఆపేశారా అంటే.. సమాచారం మేరకు కొన్ని ఇల్లు సగంలోనే ఆగిపోయిన పరిస్థితి నెలకొందన్న వార్తలు కూడా వచ్చాయి.
నెంబర్ 5.2018- 19 AP బడ్జెట్.......
2018- 19ఆర్థిక సంవత్సరానికి గాను..1,91,063 వేల కోట్లు కేటాయించారు.
2017-18 బడ్జెట్ తో పోలిస్తే.. ఈ బడ్జెట్ 21% పెరిగింది. మరి ఈ బడ్జెట్ లో ఏ ఏ రంగాలకు ప్రాతినిధ్యం వహించారో చూద్దాం.
బడికొస్తా కార్యక్రమం పేరిట 8వ తరగతి విద్యార్దునులు సైకిళ్ళు పంపిణీ చేశారు. ఉద్దానంలో మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న బాధితులకు.. వైద్య సేవల కోసం 14 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇక చివరగా మద్యం విషయానికొస్తే 7357 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వచ్చింది. 2018 వ సంవత్సరంలో చంద్రబాబు మన ap కి భారీ పెట్టుబడులు తీసుకొచ్చారు. అప్పట్లో ప్రత్యేక హోదా విషయంలో tdp కి bjp కి మధ్య వైరం మరింత ముదిరింది కూడా చెప్పుకోవచ్చు,
నెంబర్ 6.20 19- 20 AP బడ్జెట్.......
2019 ఎన్నికల్లో వైస్సార్సీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఆంద్రప్రదేశ్ సీఎంగా వైస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమించబడ్డారు.2014 నుంచి 2019 వరకు.. సుమారుగా చూసుకుంటే మన ap కి అప్పు 28% ఉంది. మరి ఇంత లోటు బడ్జెట్ లో కూడా.. ఒక విదంగా చెప్పుకోవాలంటే నవ యువ ముఖ్యమంత్రి చాలా పెద్ద నిర్ణయాలే తీసుకున్నారు. మరి cm జగన్ తన పరిపాలనను ఎలా కొనసాగిస్తూ.. ప్రజలకు ఏ మేరకు న్యాయం చేస్తారో చూడాలి మరి.
ఇక 2019 - 20 ఆర్థిక సంవత్సరానికి గాను. 2,27,975 కోట్లతో.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత బడ్జెట్ కంటే ఈసారి బడ్జెట్ 19శాతం పెరిగింది.
.జగనన్న అమ్మఒడి పథకానికి 6,455కోట్లు, కేటాయించారు. గృహనిర్మాణాలు 5 వేల కోట్లు, జలవనరుల శాఖకు 13,139 కోట్లు కేటాయించారు. ఇందులో పోలవరానికి 4,526 కోట్లు కేటాయించారు. అంటే గతేడాది కంటే 22 శాతం వరకు తగ్గించారు.
Информация по комментариям в разработке