ధ్యానము - బుద్ధిలోనికి ప్రయాణము | భగవద్గీత-ధ్యానయోగము | 05102024 | Tori Radio | Mangesh Devalaraju

Описание к видео ధ్యానము - బుద్ధిలోనికి ప్రయాణము | భగవద్గీత-ధ్యానయోగము | 05102024 | Tori Radio | Mangesh Devalaraju

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ || ౧౧ ||

అశుచి లేని మనస్సే శుచియైన ప్రదేశం
ఆత్మయందు లగ్నమైన మనస్సు స్థిరమైన ఆసనం
అందరియందలి సమభావమే ఎత్తు పల్లాలు లేని స్థితి
శరీరమే పీట, చర్మమే జింక చర్మం
ధరించిన వస్త్రమే పీటపై వేసుకొన్న వస్త్రం

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః |
ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మవిశుద్ధయే || ౧౨ ||

సాధకుడు కన్నులు మూసుకొని అక్కడ అను పదమును మనసున ఉచ్చరించుచు ఆ పదము తనలో ఎక్కడ పుట్టుచున్నదో గుర్తించుటకు మనస్సుతో తన లోపలికి ప్రయాణం చేయవలెను

దానితో తన భావములు సంకల్పములు ఎచ్చట నుండి ప్రేరేపించబడుతున్నవో అట్టి ఉత్తమమైన వెలుగు వైపునకు మనసు ఉన్ముఖమవును

అప్పుడు ఆసనము అను స్థితి నిలబడును

యోగవిద్యలో ఆసనము అనేది చిత్తము ఆసీనమగుటకు తగిన స్థితి

జీవునితో కూడిన శరీరము స్థిరముగా ఉండవలెనన్నతో జీవనస్థితి స్థిరమైనప్పుడే అది సాధ్యము

Комментарии

Информация по комментариям в разработке