Khamenei Says Iran and its Allies will Not Back down From Israeli Attacks

Описание к видео Khamenei Says Iran and its Allies will Not Back down From Israeli Attacks

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ...ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా-అలీ ఖమేనీ...సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ శత్రువులను కచ్చితంగా ఓడిస్తామని...శపథం చేశారు. ఇజ్రాయెల్ ను...అమెరికా ఒక సాధనంగా వాడుకొని పశ్చిమాసియాలోని భూములు, వనరులపై నియంత్రణ కోసం యత్నిస్తోందని ఆరోపించారు. ఇజ్రాయెల్ పై పోరాటం చేస్తున్న పాలస్థీనా, లెబనాన్ కు...ఆయన మద్దతు ప్రకటించారు. టెహరాన్ లో జరిగిన శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ఖమేనీ...ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడులను ఖమేనీ సమర్థించారు. హమాస్ లేదా హెజ్ బొల్లాపై ఇజ్రాయెల్...విజయం సాధించలేదన్నారు. లెబనాన్ రాజధాని బీరుట్ లో ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన హెజ్ బొల్లా చీఫ్...హసన్ నస్రల్లాను ప్రశంసించారు. నస్రల్లా అందరి మధ్య లేనప్పటికీ ఆయన అనుసరించిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందన్నారు. హెజ్ బొల్లాను దీవించిన చెట్టుగా పేర్కొన్న ఖమేనీ...అది నస్రల్లా నాయకత్వంలో క్రమంగా పెరిగిందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ తదుపరి లక్ష్యం ఖమేనీ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో...ఇరాన్ సుప్రీం లీడర్ బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయటం...ప్రాధాన్యం సంతరించుకుంది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке