Richest man in Babylon | About Babylon | TAB: Telugu Audio Book

Описание к видео Richest man in Babylon | About Babylon | TAB: Telugu Audio Book

మన దేశ సౌభాగ్యం మనలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆర్థిక శ్రేయస్సు మీద ఆధారపడి ఉంటుంది.ఈ పుస్తకం మనలోని ప్రతి ఒక్కరి సొంత విజయాలతో కూడుకుని ఉంటుంది. విజయం అంటే మన సొంత ప్రయత్నాలు, శక్తి సామర్థ్యాలతో మనం ఏదైనా సాధించడం. సరైన సన్నాహాలు చేసుకోవడం విజయం సాధించడానికి తొలి మెట్టు. మన ఆలోచనలు ఎలా ఉంటే మన చేతలు కూడా అలానే ఉంటాయి. మనం ఎలా అర్థం చేసుకుంటామో అలానే ఆలోచిస్తాము.
ఆర్థిక జ్ఞానాన్ని సముపార్జించడానికి ఈ పుస్తకం ఒక మార్గదర్శి. దీని వలన పట్టుదలతో ఉన్నవాళ్లకి ఆర్థిక విజయాల విషయంలో ఉపకారం జరుగుతుంది. దానివల్ల వారు డబ్బు సంపాదించి దానిని జాగ్రత్త చేసుకుని ఇంకా డబ్బు సంపాదించగలరు.
తరువాతి పేజీలు మనల్ని ప్రాథమిక ఆర్థిక సుత్రాలను పెంచి పోషించిన బాబిలోన్ తీసుకువెళతాయి. ఆ సూత్రాలను ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించి అనుసరిస్తోంది.
ఎన్నో దేశాల నుంచి పాఠకులు తమకి ఆర్థిక ఎదుగదలకి, గొప్ప ఆర్థిక విజయాలు కలిగేందుకు, క్లిష్టమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి పరిష్కారం దొరికేందుకు ఈ పుస్తకం స్ఫూర్తిని ఇచ్చిందని ఉత్సాహంగా చెబుతున్నారని రచయిత పేర్కొన్నారు. అటువంటి స్ఫూర్తె కొత్త పాఠకులకి కలగాలన్న ఆకాంక్షను రచయిత వెలిబుచ్చుతున్నారు.
కథలను మిత్రులకి, బంధువులకి, ఉద్యోగులకి, సహచరులకి ధారాళంగా పంచిన వ్యాపార కార్యనిర్వాహకులకి రచయిత ఈ సందర్భంగా తన కృతజ్ఞతను తెలుపుకుంటున్నారు. అనుభవజ్ఞులైన వారు చెప్పే విషయాల కంటే వేరే ఏదీ గొప్పది కాదు. ఎందుకంటే వారు ఆ సూత్రాలని అమలుపరిచి ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించినవారు కాబట్టి.
బాబిలోన్ ప్రాచీన కాలంలో అత్యంత సంపన్నమైన నగరం. ఎందుకంటే ఆ నగర వాసులు ఆ కాలంలో అత్యంత ధనవంతులు. వారు డబ్బు విలువని తెలుసుకుని గౌరవించారు. వారు డబ్బుని సంపాదించడం, డబ్బు దాచడం, ఆ డబ్బుతో ఇంకా డబ్బుని ఆర్జించడంలో చాలా మంచి సూత్రాలను పాటించారు. వారు మనమంతా కోరుకునేదాన్ని పొందారు...అదే భవిష్యత్తు కోసం ఆదాయం. -జీ. ఎస్. సీ

Idly Vada Aakasam (Orchid) :    • Idly Vada Aakasam  (Orchid) | Full Au...  

Rich dad Poor dad :    • Rich dad Poor dad | Full Audiobook | ...  

Steve Jobs :    • Steve Jobs | Full Audiobook | TAB:Tel...  

You can win :    • You can win | Full Audiobook | TAB:Te...  

Wings of Fire:    • Wings of Fire | Full Audiobook | TAB:...  

#Richestmaninbabylon #teluguaudiobook

Комментарии

Информация по комментариям в разработке