Ep: 09 - Mohana Raaga (మోహన రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas |

Описание к видео Ep: 09 - Mohana Raaga (మోహన రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas |

మోహనము/మోహన రాగం:---

“భక్తి గీతాంజలి యూట్యూబ్ ఛానల్" వీక్షిస్తున్న సంగీత అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనములు.
హార్మోనియం మరియు కీ బోర్డు పై సంగీత శిక్షణలో భాగంగా రెండవ దశ అయిన “రాగవాణి" లో ఈనాటి రాగం “మోహనము".
“గ్రహభేదం" ద్వారా ఒకే స్వర స్థానాలలో ఏర్పడే 5 రాగాలలో మేటి ఔడవ రాగం, సుప్రసిద్ధ రాగం.

“మోహనము" అంటే మోహింపజేయునది అని అర్ధము. ఈ రాగం మిక్కిలి ఆకర్షణ కలిగియుంటుంది. ఆహ్లాదమును పంచుతుంది. ఈ రాగంలో వేణుగానం చేస్తే మైమరువని మనసుండదు.స్పందించని హృదయముండదు.

ఈ రాగం కర్ణాటక సంగీతానికి సంబంధించిన ఔడవ ఔడవ రాగం మరియు ఉపాంగ రాగం. హిందూస్థానీ సంగీతం లో దీనికి సమానమైన రాగం భూప్. మోహన రాగం 28 వ మేళకర్తా రాగమైన హరికాంభోజి రాగానికి జన్యరాగంగా చెప్పబడింది. కాని ఈ రాగ లక్షణంలో 65 వ మేళకర్తా రాగమైన మేచకళ్యాణికి జన్యంలా అనిపిస్తుంది. ఈ రాగం లోని 5 స్వరాలతో ప్రపంచమంతా వివిధ విధాలుగా వాడబడుతున్న రాగం. ఈరాగమును గ్రహభేదం చేస్తే రిషభముతో మధ్యమావతి, గాంధారముతో హిందోళం, పంచమంతో శుధ్ధ సావేరి, దైవతం తో ఉదయ రవి చంద్రిక అనే మరో 4 రాగాలు వస్తాయి. అంటే ఈ 5 రాగాలు ఒకే స్వర స్థానాలపై వస్తాయి. అది ఇంతకు ముందు రాగవాణి 4 వ వీడియోలో విపులంగా గ్రహభేదం గూర్చి తెలియచేయడం జరిగింది.

అన్ని వేళల పాడదగిన రాగం. ఈ రాగాలాపనతో సంతోషం, ధైర్యం, ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. గాంధార దైవతాలు జీవ స్వరాలు. గ్రహ స్వరాలుగా కూడా చాలా చక్కని ఆహ్లాదకర ఆరంభాన్నిస్తాయి.

ప్రాచీన, నవీన చలన చిత్ర సంగీత దర్శకులందరూ అలాగే నవీన దర్శకులు కూడా ఈ రాగంలో పాటలను చేసారు.

ఆరోహణము, అవరోహణ లు చూద్దాం.
ఆ: స రి2 గ3 ప ద2 స
అ: స ద2 ప గ3 రి2 స

రాగఛ్ఛాయ కోసం స్వర ప్రయోగం:

దసరిగా గదపా గపదసా దగరిసా దసరిగా
దగరిసదపగా గదపగరిసదా గరిసదసా

ఈ రాగంలో ఈ 6 స్వరాలనూ సాధన చేస్తే మోహన రాగం చాలా వరకు వాయించడం వచ్చేస్తుంది.

1 సారిగ పదసా సాదప గరిసా
2 సరిగప గపదస సదపగ పగరిస
3 సారిగ రీగప గాపద పాదస
సాదప దాపగ పాగరి గారిస
4 ససరిగ పాపగ దదపా గగపా
పదసా సదదప సదదప పగరిస
5 సరిగరి గపగప గపదస సాసా
రిసదప సదపగ దపగరి పగరిస
6 సరిగప దపగరి సరిగప గపదస
సదపగరిగపద సదపగ పగరిస

ఈ రాగం జంటలకు కూడా బాగా నప్పుతుంది.
జంటలు:
సస రిరి గగ పప దద సస
సస దద పప గగ రిరి సస
ససగగరిరిసస, గగదదపపగగ దదగగరిరిసస
గగరిరి గగసస రిరిసస రిరిదద గగపపదదరిరిసా.

దాటులు:
దగరిసా, గదపగా, దగరిసా,
దగరిస దరిసద పసదప గదపగ రిపగరి సగరిసదసా.

ఆలాపన:

పద్యం:
కందము:—
గిరిధర! గోపీ వల్లభ!
సురగణ వందిత! ముకుంద! సుందర వదనా
తరుణము నాపై కృపగన
మరువను నీ నామ భజన మన్మధ జనకా!

ఈ రాగంలో కొన్ని కృతులు, కీర్తనలు, పాటలు:

01 రామా నిన్ను నమ్మిన వారము కామా
త్యాగరాజ స్వామి కృతి

02 నిన్ను కోరి - వర్ణం
శ్రీ రామనాథ్ శ్రీనివాస్ అయ్యంగార్.

03 శివ శివ శంకర భక్తవ శంకర - భక్త కన్నప్ప
04 తిరుమల మందిర సుందర - మేన కోడలు
05 ఘనాఘన సుందరా - భక్త తుకారాం
06 శ్రీ రామ నీనామమెంతో రుచిరా - శ్రీరామదాసు
07 చందన చర్చిత నీల కళేబర - భక్త జయదేవ
08 ఈనాటి ఈ హాయి - జయసింహ
09 ఓ...వయ్యారమొలికే చిన్నది - మంగమ్మ శపధం
10 లాహిరి లాహిరి లాహిరిలో - మాయాబజార్
11 నారాజు పిలిచెను - మంగమ్మ శపథం
12 వే.. వేల.. గోపెమ్మల - సాగర సంగమం
13 పాడవేల రాధికా - ఇద్దరు మిత్రులు
14 మౌనముగా నీ మనసు పాడిన - గుండమ్మ కథ
15 లేరు కుశలవుల సాటి - లవకుశ
16 నను పాలింపగ నడచీ - బుద్ధిమంతుడు
17 నిన్ను కోరి వర్ణం సరిసరి - ఘర్షణ
18 మదిలో వీణలు మ్రోగే - ఆత్మీయులు
19 ఎచటి నుండి వీచెనో - అప్పుచేసి పప్పుకూడు
20 జయ కృష్ణా ముకుందా మురారి,(రాగమాలిక) పాట ప్రారంభం - పాండురంగ మహత్యం
21 ఈశా గిరీశా మహేశా రాగమాలికలో ప్రారంభం- శ్రీకాళహస్తి మహత్యం
22 మనసు పరిమళించెనే -శ్రీకృష్ణార్జునయుద్ధం
23 పొడగంటిమయ్యా మిమ్ము - అన్నమాచార్య
24 ఇతడొకడే సర్వేశ్వరుడు - అన్నమాచార్య
25 సిరులు సౌఖ్యములు - స్వీయ రచన
26 అలాగే సుందర కాండములోని “విరితేనియలు,
కపికిశోరుడు, పూవులనిన" (39,40,41), “అన్నా రావణ తెలిసిన వాడవు, అన్నా వీనిని వధియింపకుమా" (121, 122)

27 ఘంటసాల గారి భగవద్గీత లోని “యదా యదాహి, పరిత్రాణాయ, ఊర్ధ్వమూల, నతద్భాస, అహం వైశ్వానరో“ శ్లోకాలు.

*గమనిక :-
పై పాటలు కొన్ని పాటలలో అన్య స్వరములు కూడా వుండవచ్చు.*

మోహన రాగంలో ఇంకా చాలా పాటలున్నాయి. ఒకసారి రాగము యొక్క ఛాయలు తెలిస్తే ఆ రాగంలోని పాటలను సులభంగానే తెలుసుకోవచ్చు.

ఈ వీడియో మీకు నచ్చితే, మీ సంగీత మిత్రులకు ఉపయోగపడతుందని మీరు భావిస్తే లైక్ చేసి, షేర్ చేయండి. మా వీడియోలు తప్పనిసరిగా మీకు అందాలంటే, మన భక్తి గీతాంజలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఏక్టివేట్ చేయడం మర్చిపోకండి.

🙏జై శ్రీమన్నారాయణ🙏
శుభమస్తు

మీ రమేష్ బాబు సీపాన
+91 9949124221

Support Us:
Link to Donate: https://bit.ly/36bKvLH

Connect With Us:
Telegram: https://t.me/Bhakthigeethanjali
Twitter:   / bhakthigeethanj  
Facebook:   / bhakthigeeth.  .
Instagram:   / bhakthigeet.  .
E-Mail: [email protected]

Комментарии

Информация по комментариям в разработке