ఈ ఇడ్లీ పొడితో ఇంట్లో చేసే ఇడ్లీలు మరింత రుచిగా మారడం ఖాయం | Homemade Idli Podi

Описание к видео ఈ ఇడ్లీ పొడితో ఇంట్లో చేసే ఇడ్లీలు మరింత రుచిగా మారడం ఖాయం | Homemade Idli Podi

ఈ ఇడ్లీ పొడితో సాధారణమైన ఇడ్లీలు మరింత రుచిగా మారడం ఖాయం | Homemade Idli Podi @HomeCookingTelugu ​

గన్ పౌడర్ అని ఎంతో మంది ఇష్టంగా పిలిచే ఇడ్లీ పొడి, ఇడ్లీలకి ఎంత రుచి తెస్తుందో కదా. దీన్ని అచ్చం హోటల్లో దొరికే పొడి టేస్ట్ వచ్చేట్టు ఇంట్లో ఎలా చేయాలో మీరు ఈ వీడియోలో చూడచ్చు. అలాగే, నేను ఇందులో కొంచెం పంచదార వేసాను. ఒకవేళ అది మీకు ఇష్టంలేకపోతే, పంచదార వేయకుండా మిగిలినవన్నీ వేసి, ఈ పొడి తయారుచేసుకోవచ్చు. తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్లో నాకు చెప్పండి.

#idlipodi #karamapodi #idlikarampodi

Here's the link to this recipe in English: https://bit.ly/3gHDLAc

తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 10 నిమిషాలు
సెర్వింగులు: -

కావలసిన పదార్థాలు:

నువ్వుల నూనె - 1 టీస్పూన్
పచ్చిశనగపప్పు - 1 / 2 కప్పు
మినప్పప్పు - 1 / 4 కప్పు
వేరుశనగ్గుళ్ళు - 1 / 4 కప్పు
వేయించిన శనగపప్పు - 1 / 4 కప్పు
గుంటూరు ఎండుమిరపకాయలు - 10
కాశ్మీరీ ఎండుమిరపకాయలు - 10
నువ్వుల నూనె - 1 టీస్పూన్
తురిమిన పచ్చికొబ్బరి - 1 కప్పు
వెల్లుల్లి రెబ్బలు
చింతపండు
కల్లుప్పు - 1 1 / 2 టీస్పూన్లు
ఇంగువ - 1 / 2 టీస్పూన్
పంచదార - 1 టీస్పూన్

తయారుచేసే విధానం:

ఒక ప్యాన్లో నువ్వుల నూనె వేసి, అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి కాస్త వేయించిన తరువాత వేరుశనగ్గుళ్ళు కూడా వేసి, అన్నీ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ లో-ఫ్లేములో వేయించాలి

ఇవన్నీ వేగిన తరువాత ప్యాన్లో వేయించిన శనగపప్పు వేసి బాగా కలిపి, అన్నిటినీ కనీసం రెండు నిమిషాలు వేయించాలి

ఆ తరువాత వీటిని పూర్తిగా చల్లార్చాలి

అదే ప్యాన్లో మళ్ళీ నువ్వుల నూనె వేసి, గుంటూరు ఎండుమిర్చి, కాశ్మీరీ ఎండుమిర్చి వేసి బాగా వేయించి, పక్కన పెట్టి చల్లార్చాలి

మళ్ళీ అదే ప్యాన్లో నువ్వుల నూనె వేసి, తురిమిన పచ్చికొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు ముక్కలు వేసి బాగా వేయించి, పక్కన పెట్టి, చల్లార్చాలి

ఒక మిక్సీ జార్లో వేయించిన ఎండుమిరపకాయలు వేసి పొడి పట్టాలి

ఇందులో వేయించిన పప్పుల్ని కొద్దికొద్దిగా వేసి పొడి పట్టాలి

చివరగా ఇందులో వేయించిన కొబ్బరి+వెల్లుల్లి+చింతపండు వేసిన తరువాత కల్లుప్పు, ఇంగువ, పంచదార వేసి మొత్తం అంతా మళ్ళీ పొడి పట్టాలి

అంతే, చాలా రుచిగా ఉండే ఇడ్లీ పొడి తయారైనట్టే, వేడివేడి ఇడ్లీల మీద పొడి చల్లి, పైన నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ రాసిన తరువాత పొడి ఇడ్లీలు సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి

వీటిని మీకు నచ్చినట్టు కొబ్బరి చట్నీతో, లేదంటే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు

Hey guys!

As you all know, the legendary tiffin IDLI which is very common across all the southern states. Although the name is one and the same, every state has it's own style of making Idli. But wait, that's not what we are going to see now! My focus today is mainly on the magical Gun Powder or Idli Podi as we all lovingly call it. This Podi is a total gamechanger for a normal, simple, decent Idli which is very plain in taste. It adds a lot more drama when is sprinkled on a piping hot idli with some ghee generously poured on it. Don't you think that reading this is even more is just killing time? So go to the video right away, watch it, make it alongside your Idli and enjoy.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке