Rainbow Hospital Successfully Completed Rare Operation Unborn Baby |Rare Procedure Saves Unborn Baby

Описание к видео Rainbow Hospital Successfully Completed Rare Operation Unborn Baby |Rare Procedure Saves Unborn Baby

ప్రముఖ చిన్న పిల్లల ఆస్పత్రి రెయిన్ బో... అత్యంత అరుదైన శస్త్రచికిత్సను దిగ్విజంగా పూర్తిచేసినట్టు ప్రకటించింది. తల్లికడుపులోంచి ఇంకా పూర్తిగా బయటకురాని పసికూన వాయు నాళాల్లోకి... ప్రత్యేక పైప్ లను పంపటం ద్వారా బుజ్జాయి ప్రాణాలను కాపాడినట్టు పేర్కొంది. ఈ మేరకు బంజారాహిల్స్ రెయిన్ బో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో... ఫీటల్ మెడిసన్ స్పెషలిస్ట్ డాక్టర్ గాయత్రి ,డాక్టర్ స్రవంతి తో పాటుగా.. NICU విభాగం డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల పలువురు వైద్యులు పాల్గొన్నారు. వరంగల్ కి చెందిన దంపతులకు ఆరు సార్లు గర్భస్రావం కాగా.. ఏడో సారి గర్భం నిలించింది. ఏట్టకేలకు తల్లిదండ్రులు కాబోతున్నామన్న ఆ దంపతుల సంతోషాన్ని.. కడుపులోని బిడ్డ మెడపై భారీ కణితి ఉందన్న వార్త ఆవిరిచేసింది. పాప మెడపై ఉన్న భారీ కణితి కారణంగా.. ప్రసవ సమయంలో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది కలిగి.. ప్రాణం పోయే ప్రమాదం ఉందని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రికి వచ్చిన వారికి... భరోసా కల్పించిన రెయిన్ బో వైద్యులు .. ఎగ్జిట్ ప్రొసీజర్ ద్వారా తల్లిబిడ్డలను కాపాడినట్టు ప్రకటించింది. ఈ పద్ధతిలో తల్లిగర్భంలోంచి సీ సెక్షన్ ద్వారా బిడ్డ తలను బయటకు తీసి.. 11 నిమిషాల వ్యవధిలోనే చిన్నారి శ్వాసనాళంలోకి ప్రత్యేక పైప్ ను పంపి బిడ్డ ఊపిరి పీల్చుకునేలా చేయటం ద్వారా.. తల్లిబిడ్డలను కాపాడినట్టు తెలిపారు. ప్రసవానంతరం పాప మెడకు శస్త్రచికిత్స చేసి.. సుమారు 600 గ్రాముల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించినట్టు తెలిపారు. ప్రస్తుతం తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке