మనోరథం

Описание к видео మనోరథం

#kavita #voiceover #love #dsp #telugukavithalu
చివరి జన్మలో నీకు "బందీ"గా మరణించిన నా మనసు,
ఏ "ఇష"స్సుల(దేవతల) దీవేనో,
పునర్జన్మతో నెమలిపింఛమై నీ శిరస్సుని చేరుతోంది కృష్ణా !!
అధరాల గడప దాటలేని మాటల ముత్యాలెన్నో జారి ,
పాలపుంతల ఊహల్లో వందల ఎకరాల పారిజాతాలుగా పూసాయి.
ఏ "లలితం"(పుష్పం) అయినా .. నీ పాదాలపై జారి
నీకు నా "నిజ"అభిలాషలని వర్ణించదా అని.
ఏ "అనూష"(ప్రేమ/ఉదయాన) ఘట్టాన జరిగిన మిథునమో,
నా అక్షర గర్భం లో పురుడు పోసుకుంటున్న ఈ ప్రేమ "ప్రతాపా"నికి నేను ఏ పేరు పెట్టను !!
కాన్వి (కృష్ణుని ఫ్లూట్) ని అయినా కాకపోతిని, నీ "ప్రేమల" స్వరంలో లీనమై.

ఇట్లు నీ సేవలో నిత్యం జీవిస్తున్నా అని రాసుకుంటున్న అబద్దపు కవితల్లో
చివరి మాట ఏంరాయాలో "రాదు" అని "భాద"తో తడబడుతున్న
నా హృదయానికి పోటీనిస్తున్నాయి నా చేతి మట్టి గాజుల శబ్దాలు.

Комментарии

Информация по комментариям в разработке