BCCI's Appointment of Gautam Gambhir as Next Head Coach of India a Done Deal! | Report

Описание к видео BCCI's Appointment of Gautam Gambhir as Next Head Coach of India a Done Deal! | Report

భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్ గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని.., ఇక ప్రకటనే వెలువడాల్సి ఉందని బీసీసీఐకి సన్నిహితంగా ఉండే ఐపీఎల్ ఫ్రాంఛైజీ వర్గాలు వెల్లడించాయి. గౌతమ్ గంభీర్ మెంటార్ గా ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2024 సీజన్ లో విజేతగా నిలిచింది. దీంతో గంభీర్ నే టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గా తీసుకోవాలనే సూచనలు వచ్చాయి. ఇప్పటికే కోచ్ పదవి కోసం దరఖాస్తుల గడువు కూడా ముగిసింది. గంభీర్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని బీసీసీఐ వర్గాలకు చాలా దగ్గరగా ఉండే ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. గంభీర్ కాకుండా ఎంఎస్ ధోనీకి ఈ అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొందరు మాజీల్లో ఉంది. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసే వ్యక్తి అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని ఫార్మాట్ ల క్రికెట్ నుంచి రిటైర్ అయి ఉండాలి. కానీ, ధోనీ ఇంకా ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరితో ముగియనుంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке