muudunaalla ముచ్చటకి మురిసిపోకు గాయని ఉమా మహేశ్వరి

Описание к видео muudunaalla ముచ్చటకి మురిసిపోకు గాయని ఉమా మహేశ్వరి

రాగం: హిందోళం. ఆది తాళం
ప:-జగమే మాయరా మిగిలేదేదిరా
మదిలో రాఘవుని మరచిపోకు రా
"జగమే"
చ1:-మూడు నాళ్ళ ముచ్చటకై మురిసిపోకు
ముప్పువచ్చు ఎప్పుడైనా చెప్పలేము
రాముని సేవయే పావన భాగ్యము
ఇలలో నిన్ను నేను మరువలేను రా
"జగమే"
చ2:-వయస్సు సొగసు చూసి నీవు భ్రమసిపోకు
కలిమి బలిమి చూసి నీవు కులికి పోకు
అంతా కల్లరా చింతలు మానరా
భువిలో ఉన్నదేదీ నీది కాదురా
"జగమే"
చ3:-కామ లోభ మోహములు దరిని చేరకు
బాధయందు ఆనందము చెందనేర్చుకో
పేదల రోదనే జీవన నామమై
ఎదలో నిన్ను నేను మరువలేను రా
"జగమే"

Комментарии

Информация по комментариям в разработке