KANCHI PARAMACHARYA LIFE STORY BY CHAGANTI GARU || CHAGANTI PREACHES || PRAVACHANALU ||

Описание к видео KANCHI PARAMACHARYA LIFE STORY BY CHAGANTI GARU || CHAGANTI PREACHES || PRAVACHANALU ||

చంద్రశేఖరేంద్ర సరస్వతి (1894 మే 20, – 1994 జనవరి 8) కంచి కామకోటి పీఠం జగద్గురుగా అధిష్టించిన వారి వరసక్రమంలో 68వ వారని తెలుస్తుంది.[1] పీఠం అధిష్టించినప్పటి నుండి పీఠం అదిష్టించినవారిని జగద్గురు, పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో పిలిచే ఆచారం పరంపరంగా వస్తుంది.[2] జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటాడు. సంకల్పబలంతో ఏదైనా పని ఫలానా సమయానికి పూర్తి కావాలంటే అయి తీరుతుందని, ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తులసంఖ్యపై గాక దాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందంటాడు స్వామి.
జీవిత విశేషాలు
కంచి మహాస్వామిగా పేరుగాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, దక్షిణ తమిళనాడులోని, దక్షిణ ఆర్కాట్ జిల్లా, విల్లుపురం గ్రామంనందు స్మార్త హొయసల కర్నాటక బ్రాహ్మణ కుటుంబంలో 1894 మే 20న అనూరాధ నక్షత్రంలో (చాంద్రమాసానుసారం) జన్మించాడు. స్వామి తల్లిదండ్రులు మహాలక్ష్మీ, సుబ్రహ్మణ్య శాస్త్రి.జిల్లా విద్యాధికారిగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రికి స్వామి రెండవ కుమారుడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి జన్మించినప్పుడు పెట్టిన పేరు స్వామినాథన్. స్వామి కుటుంబ ఇలవేల్పు, కుంభకోణం దగ్గర్లోనున్న స్వామిమలై ఆలయ ప్రధాన దేవత ఐన స్వామినాథుని పేరు మీదుగా అతని తల్లిదండ్రులు స్వామినాథన్ అని నామకరణం చేసారు.స్వామినాథన్ దిండివనంలో తన తండ్రి పనిచేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం ఆరంభించాడు. చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుని పలు పాఠ్యాంశాలలో రాణించాడు. స్వామికి 1905లో ఉపనయనం జరిగింది.శివన్‌సర్ గా పేరొందిన సదాశివ శాస్త్రి, స్వామినాథన్‌కి అనుజుడు. ఆబాలుడు 13వ ఏటనే సన్యాసదీక్ష పుచ్చుకొని కంచి కామ కోటి పీఠం అధిష్టించాడు. చంద్రశేఖరేంద్ర స్వామి కేవలం పీఠాధిపతే కాడు.అతనిలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, ఒక శాస్త్రపరిశోధ కుడు, జ్యోతిశ్శాస్త్రవేత్తను, ఆధ్యాత్మిక తరంగాన్ని ఇలా ఒకటేమిటి ఎందరినో దర్శించవచ్చు అని భక్తుల నమ్మకం.ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జీవితం అద్భుతం, అనితర సాధ్యం అని ఎవరికైనా అనిపించటానికి తగిన అవకాశాలు ఉన్నాయని అంటారు.నిండు నూరేళ్ళు విలక్షణమైన జీవితాన్ని గడిపి, పాదచారియై దేశమంతా సంచరిస్తూ ధర్మప్రభోదాలు బోభించి, అనేక దివ్యశక్తులు ప్రదర్శిస్తూ, సనాతన ధర్మపునరుద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు స్వామి.అతను 'నడిచే దేవుడి' గా ప్రసిద్ధికెక్కాడు.

చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఒకసారి తమిళనాడు రాష్ట్రం, చిదంబరం సమీపంలోని 'ఆనంద తాండవ పురం'లో ఒక మూగబాలుడికి మాటలు రప్పించాడు.స్వామి మతాతీతుడు.1926లో కారం బుక్కుడి నుండి పుదుక్కోటకు వెళ్ళే దారిలో గుంపుగా ప్రజలు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. వారిలో మహమ్మదీయులూ ఉన్నారు. అలా ఓ మహమ్మ దీయుడు స్వామి పల్లకీ మోసాడు.స్వామి అతన్ని పిలిచి క్షేమం అడిగాడు.ఆ భక్తుడు 'ఆచార్యుల రూపంలో నా కళ్ళకు 'అల్లా' కనిపించాడన్నాడు. మహాపురుషులు మతాతీతులు కదా! భారత రాజ్యాంగం మతాన్ని 'ప్రాథమిక హక్కు'గా గుర్తించడానికి చంద్రశేఖరేంద్ర స్వామి కారణమని ఈ దేశంలో చాలా మందికి తెలియదు.

చిన్నతనం లోనే హిందూ మతం నుండి క్రైస్తవం లోకి మారిన భారత జాతీయ కాంగ్రెసు నాయకుడు ఎఫ్.జి.నటేశ అయ్యర్ తన ప్రశ్నలకు క్రైస్తవంలో సమాధానం లభించక అసంతృప్తి చెందాడు. స్వామి బోధనతో తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాడు. [3]

వారు సన్యాసదీక్ష తీసుకొని మఠాధిపత్యం వహించడం వల్ల దేశ రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు, కానీ భారత స్వాతంత్య్రాన్నిస్వామి మనస్ఫూర్తిగా కాంక్షించారు. ఉద్యమాన్ని సమర్థించాడు. గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపు ఇచ్చిన నాటి నుండి స్వామి స్వయంగా ఖద్ధరు దుస్తులనే వాడాడు. 'భారత రాజ్యాంగం ద్వారా హిందూ మతాన్ని కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం.ఇది ఎంత మాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు' అని స్వామి తన భక్తులను హెచ్చరించాడని తెలుస్తుంది.

భారతదేశానికి నూతన రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఒక రాయబారవర్గాన్ని బ్రిటీష్ ప్రభుత్వం భారత్‌కు పంపింది. అప్పుడు హిందూ మతం గొప్పదనం గురించి, హిందూ సంస్థల పరిస్థితుల్ని ఆ సభ్యులకు జెప్పాలని స్వామి తన భక్తులనాదేశించాడు. అలాగే, భక్తులంతా ఆ సభ్యులకు టెలిగ్రాములు పంపారు, కానీ వారు స్పందించలేదు. అయినా స్వామి నిరాశపడ లేదు. అయితే, చివరకు తాతాచారి అనే పెద్దకు వచ్చిన ఆహ్వానం మేరకు మత సంస్థలకు రాజ్యాంగ రక్షణ అవసరమన్న స్వామి ఆశయాన్ని రాయబార వర్గంలో ముఖ్యడైన సోరెన్ సన్‌కు వివరించాడు.స్వామి ఒక్క క్షణం ధ్యానంలో మునిగి, ఆ తరువాత 'మతాన్ని ప్రాథమిక హక్కుగా' పరిగణిస్తూ, చట్టం చేయాలని బ్రిటీసు ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రం తయారు చేయమని భక్తులకు ఆదేశించాడు. ఆతరువాత ఢిల్లీ వెళ్ళి సోరెన్ సన్‌కు విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది.రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది.

కంచి పీఠాధిపతులుగా
పూర్వాశ్రమంలో స్వామినాథ అనే పేరుతో పిలవబడే వారు.స్వామికి 1905 వ సంవత్సరంలో ఉపనయనం జరిగింది.1907 ఫిబ్రవరి 13న స్వామి కంచి పీఠానికి 68 వ పీఠాధిపతిగా నియమించబడ్డారు. వేదరక్షణ, సంస్కృతి రక్షణ మొదలైన ఎన్నో కార్యక్రమాలు ఆయన పర్వేక్షణలో నిర్వహించారు. భారతదేశం అంతా పాదయాత్ర ద్వారా పర్యటించారు.స్వామి ఉపన్యాసములు చాలా ప్రసిద్ధి పొందాయి .

Комментарии

Информация по комментариям в разработке