దేశంలో స్టోర్‌కీపర్ జాబ్‌కోసం శిక్షణనిచ్చే ఏకైక సంస్థ MEIL

Описание к видео దేశంలో స్టోర్‌కీపర్ జాబ్‌కోసం శిక్షణనిచ్చే ఏకైక సంస్థ MEIL

#meil #storekeeperjob

దేశంలో స్టోర్‌కీపర్ జాబ్‌కోసం శిక్షణనిచ్చే ఏకైక సంస్థ MEIL

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమలో, స్టోర్ కీపర్ల‌ బాధ్య‌త‌లు ప్రాధ్యాన్య‌త‌తో కూడిన‌వే. ప్రాజెక్టు సైట్‌లో మెటీరియ‌ల్ నిర్వ‌హ‌ణ‌, నిల్వ‌, స‌ర‌ఫ‌రా వ్య‌వ‌హారాల్లో వీరి పాత్ర చాలా ఉంటుంది. ప్రాజెక్టు సైట్‌కు వ‌చ్చే మెటీరియ‌ల్‌ను స‌రి చూసుకోవ‌డం, డెల‌వ‌రీ తీసుకోవ‌డం, మెటీరియ‌ల్‌ను భ‌ద్రంగా నిల్వ ఉంచ‌డం, స్టాక్ పాయింట్‌ను న‌మోదు చేయ‌డం, సైట్ సిబ్బంది, మెటీరియ‌ల్ విక్రేత‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం, మెటీరియ‌ల్ ఆర్డ‌ర్ చేయ‌డం వంటి ప‌నుల‌ను స్టోర్ కీప‌ర్లు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప‌ని చేయ‌డానికి స్టోర్ కీప‌ర్ల‌కు స‌రైన శిక్ష‌ణ అవ‌స‌రం. మా CSR విభాగం, MEIL ఫౌండేషన్ ద్వారా, మేము ఇలాంటి శిక్ష‌ణ‌ను ఉచితంగా ఇస్తున్నాము. శిక్ష‌ణ తీసుకునేవారికి ఉచిత వ‌స‌తి కూడా ఏర్పాటు చేస్తున్నాము.

నిపుణుల‌తో శిక్ష‌ణ ఇప్పించ‌డ‌మేకాదు, వృత్తి నైపుణ్య ధృవీకరణ ప‌త్రాన్ని కూడా అందిస్తున్నాము. ఈ కోర్సులో ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లు ఉత్తీర్ణులయ్యారు. ఇలాంటి శిక్ష‌ణ పూర్తి చేసిన వారు మా సైట్‌ల‌లోనే ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం మూడవ బ్యాచ్లో 60 మంది విద్యార్థులు స్టోర్ కీపర్ ఉద్యోగాల కోసం జ‌డ్చ‌ర్ల వ‌ద్ద మా శిక్ష‌ణా కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మందికి త్వరలో వివిధ ప్రాజెక్ట్ సైట్‌లలో ఉపాధి క‌ల్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. భారతదేశంలో, స్టోర్‌కీపర్ ఉద్యోగాల కోసం సమగ్ర శిక్షణను అందించే ఏకైక సంస్థ MEIL ఫౌండేషన్.


Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India.The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.

Комментарии

Информация по комментариям в разработке