నగరపాలక సంస్థ కమిషనర్‌ సంతకం ఫోర్జరీ | Criminal Case Registered Signature Forgery | Nellore

Описание к видео నగరపాలక సంస్థ కమిషనర్‌ సంతకం ఫోర్జరీ | Criminal Case Registered Signature Forgery | Nellore

నెల్లూరు కార్పొరేషన్ లో ఇద్దరు కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో..వైకాపా నాయకుడు మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది. నెల్లూరు కార్పొరేషన్ లో గత నాలుగేళ్లుగా అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికార బలంతో వాటిపై విచారణ లేకుండా వైకాపా నాయకులు తప్పించుకుంటూ వచ్చారు. నెల్లూరు నగరంలో 70 భవనాలకు మార్టిగేజ్ రిలీజ్ కు సంబంధించి పెద్దఎత్తున నిబంధనల ఉల్లంఘించారు. ఫోర్జరీ సంతకాలతో....అనుమతులు మంజూరు చేశారు. అందులో కమిషనర్ ల సంతకాలు కూడా ఫోర్జరీ చేయడం సంచలనంగా మారింది. నెల్లూరు కార్పొరేషన్ గత కమిషనర్ హరిత, ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్ సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇలా కోట్ల కోట్ల రూపాయలు దండుకున్నారు. దీనిపై ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్ ........ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గత 15 రోజులుగా పోలీసులు విచారణ చేశారు. మేయర్ భర్త జయవర్దన్, కార్పొరేషన్ ఉద్యోగులు శివకృష్ణ, ప్రవీణ్, దేవేంద్ర, నాగేంద్రబాబు, కార్తిక్, మాలవీయకు సంబంధం ఉన్నట్లు తేల్చారు. మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ప్రోత్సాహంతోనే ఉద్యోగులు అక్రమాలపై పాల్పడినట్లు పోలీసులు నివేదికలో తెలిపారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో.. ఇప్పటికే కార్పొరేషన్ కార్యాలయంలో నలుగురు ఉద్యోగులపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు


----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке