200 మందితో ప్రైవేటు సెక్యురిటీని నియమించుకున్న జగన్‌ | Jagan Deployed Security For his Protection

Описание к видео 200 మందితో ప్రైవేటు సెక్యురిటీని నియమించుకున్న జగన్‌ | Jagan Deployed Security For his Protection

ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాభవంతో వైకాపా అధ్యక్షుడు జగన్... ఇంటి వద్ద భద్రత కోసం భారీఎత్తున ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటుచేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అత్యంత విశాల ప్రదేశంలో విలాసవంతమైన నివాసం, క్యాంపు కార్యాలయాన్ని 2018లో జగన్ నిర్మించుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో భద్రత కోసం భారీఎత్తున పోలీసు సిబ్బందిని నియమించారు. జగన్ నివాసం, క్యాంపు కార్యాలయాలకు వచ్చే పలు మార్గాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు పెట్టారు. 24 గంటల పాటు భద్రత, నిఘా బృందాలు పనిచేసేవి. నివాసం సహా చుట్టుపక్కల ప్రాంతాల భద్రతకే రోజుకు 200 మందికిపైగా బాధ్యతలు అప్పగించేవారు. కానిస్టేబుళ్లు, ఎస్సైలు, సీఐలు, ఇంకా పైస్థాయి అధికారుల్ని బందోబస్తుకు రప్పించేవారు. ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోవడం, వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో.... ఇంటి చుట్టూ చెక్ పోస్టులను ఎత్తివేశారు. పోలీసు భద్రత తగ్గించారు. స్థానికుల విజ్ఞప్తులతో జగన్ ఇంటి ముందున్న నాలుగు లేన్ల రహదారిపై ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. సామాన్య ప్రజల వాహనాల రాకపోకలను అనుమతించింది. ఎన్నికల్లో ఓటమితో తాడేపల్లి పట్టణంలో హైవే పక్కనున్న వైకాపా కేంద్ర కార్యాలయాన్ని మూసేసిన జగన్... క్యాంపు కార్యాలయాన్నే పార్టీ కార్యాలయంగా మార్చేశారు. ఈ పరిస్ధితుల్లో తన ఇల్లు సహా పార్టీ కార్యాలయం భద్రత కోసం భారీ ఎత్తున ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్నారు. 24 గంటల పాటు కాపలా కాసేలా అన్ని షిఫ్టులకు కలిపి 200 మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించినట్లు తెలిసింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке