Chittoor Famous king Biryani | Mutton Biryani | Chiken Biryani | Mutton Curry | Chittoor | Food Book

Описание к видео Chittoor Famous king Biryani | Mutton Biryani | Chiken Biryani | Mutton Curry | Chittoor | Food Book

#foodbook
#muttonbiryani
#chickenbiryani

హోటల్ కింగ్ ,చిత్తూరు.
గూగుల్ లొకేషన్:-
https://g.co/kgs/ge4bLi

ప్రకృతి అందాల ప్రవాహ పయణాన మదిని కమ్మేసింది లాలిత్యపు లాహరి.ముగ్ధ మనోహర దృశ్యాలు సమ్మోహన పరచగా,మలయ సమీరం పరవశమై హాయిని గొల్పింది.నూతన ప్రదేశాలకు వెళ్లాలని అక్కడి రుచులను నేను ఆస్వాదించి మీతో పంచుకోవాలన్న నా ఆకాంక్ష అనుగుణంగా సాగిన ఆహార విహారం చిత్తూరుకు చేరింది.ఎన్నో పుణ్యక్షేత్రాల పుణ్య ధరణి చిత్తూరు.పాడి పంటలకు ప్రసిద్ధి.చిత్తూరు మామిడి మధురం,పంచదార సుమధురం వాసికెక్కాయి.సమీపాన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రలు ఉండటంతో మాతృభాష తెలుగుతోపాటు కన్నడ, తమిళం మాట్లాడగలరు ఇక్కడి వారు.మూడు ప్రాంతాల సంస్కృతి ఇచ్చట సంతరించుకుని ఉంటుంది. కావున ద్రవిడ సంగమంగా అభివర్ణిస్తారు చిత్తూరును. ఇక్కడకు రావడం ప్రసిద్ధి చెందిన ఆహారాశాలలు గుర్చి చిత్రీకరణ జరపడంపట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను.చిత్తూరు వడిలో నాలుగు రోజుకున్నాం ఆ స్మృతులను మీతో పంచుకోబోతున్నాను.స్థానికుల అభిరుచి మేరకు దేశీయంగా రూపుదాలుతున్న బిర్యానిలెన్నో.ప్రాంతానికో బిర్యానీ ప్రాచుర్యంలో ఉంది.కొన్ని బిర్యానీలను అక్కడి వారు పొందిన ఆస్వాధన ఇతరులు పొందలేకపోవచ్చు.చెప్పాలంటేఇష్టపడక పోవచ్చు.కానీ చిత్తూరు బిర్యానీ మాత్రం అందరి మెప్పు పొందగలదు.చిట్టిముత్యాలు మరియు బాస్మతి బియ్యంతో రెండు రకాలుగా లభిస్తుంది.సంతృప్తి కరంగా ఉంటుంది.ఈ ప్రాంత నేపధ్యానికి ప్రాతినిధ్యం కొన్ని దశాబ్దాలుగా లభిస్తున్న కింగ్ మటన్ బిర్యానీ.ఈ బిర్యానీ గురించి వక్కమాటలో చెప్పాలంటే నా ఆహార విహారాన నాకు అమితంగా నచ్చిన బిర్యానీ.కట్టెలపొయ్యి మీద వంటకం కమ్మగా ఉంది.ఆ రుచికి నేను ముగ్ధుడినయ్యాను.బిర్యానీకి జోడిగా గోంగూర,వంకాయ కూర,పెరుగు ఉల్లిపాయలు ఇస్తారు.తిన్నామంటే లయమగు అనుభూతి పరిపూర్ణం.మసాలా ద్రవ్యాల పరిమితి వినియోగం అభినందనీయం.
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Комментарии

Информация по комментариям в разработке