Cervical Cancer: Causes, Symptoms, and Treatment Types in Telugu | Medicover Hospitals

Описание к видео Cervical Cancer: Causes, Symptoms, and Treatment Types in Telugu | Medicover Hospitals

Cervical Cancer: Causes, Symptoms, and Treatment Types in Telugu | Medicover Hospitals

డా. ఆర్. ఈ. ఏ. ముత్తు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు, ఈ వీడియో లో గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ గురించి వివరించారు.

0:00 - గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్

మన దేశంలో ప్రతి ఏడాది లక్ష మంది గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ బారిన పడుతున్నారు, ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒకరు దీని వల్ల చనిపోతున్నారు. మన దేశంలో ఈ కాన్సర్ గురించి ప్రజల్లో ఎక్కువగా అవగాహన లేకపోవడం వల్ల, ఇతర దేశాలతో పోలిస్తే ఈ కాన్సర్ వల్ల మరణాల సంఖ్యా మన దేశంలోనే ఎక్కువగా ఉంది.

1:26 - గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు:
- గర్భాశయ క్యాన్సర్ కి ముఖ్య కారణం హ్యూమన్ పాపిల్లోమావైరస్
- వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం
- ధూమపానం అలవాటు ఉండడం
- తక్కువ రోగనిరోధక శక్తి ఉండడం
- లైంగికంగా వచ్చే ఇన్ఫెక్షన్స్
ఇలా అనేక కారణాల వల్ల గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ వస్తుంది.

2:10 - గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ లక్షణాలు:
- రక్తస్రావం
- వైట్ డిశ్చార్జ్ అవ్వడం
- మూత్రవిసర్జన సమయంలో మంటగా అనిపించడం
ఇవన్నీ కూడా తొలి దశలో కనిపించే లక్షణాలు

2:35 - గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చివరి దశలో కనిపించే లక్షణాలు ఏమిటి అంటే?
- ఆకలి లేకపోవడం
- బరువు తగ్గడం
- వెన్నుపూసలో నొప్పి ఉండడం
- కాళ్ళల్లో వాపులు ఉండడం
- మూత్రం తో పాటు రక్తం రావడం

3:15 - చికిత్స విధానాలు
- పెల్విక్ ని పరీక్షించడం
- బయాప్సీ పరీక్ష
- అల్ట్రాసౌండ్ స్కాన్
ఈ పరీక్షలు చేసిన తరువాత, కాన్సర్ ఏ స్టేజి లో ఉంది అని తెలుసుకొని, చికిత్స చేయడం జరుగుతుంది.

- మొదటి లేదా రెండవ స్టేజి లో ఉన్నట్టు అయితే సర్జరీ చేయడం జరుగుతుంది.
- రెండవ లేదా మూడవ స్టేజి లో ఉన్నట్లు అయితే రేడియేషన్, కెమోథెరపీ చేయడం జరుగుతుంది.
- నాలుగవ దశలో పాలియేటివ్ కెమోథెరపీ చేయడం జరుగుతుంది.

5:56 - గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎం చేయాలి?
- ధూమపానం, మద్యపానం చేయకూడదు.
- వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
- వ్యాక్సిన్ తీసుకోవాలి

మరిన్ని వివరాల కోసం వీడియో ని పూర్తిగా వీక్షించండి.

#CervicalCancer #CervicalCancerSymptoms #CervicalCancerTreatment #MedicoverHospitals

For Appointments, Call 040 6833 4455
or
Visit: https://www.medicoverhospitals.in/

►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News & more.

Follow us on Other Platforms:
Facebook:   / medicoverhospitals  
Instagram:   / medicoverhospitals  
Twitter:   / medicoverin  
LinkedIn:   / medicoverhospitals  

Комментарии

Информация по комментариям в разработке