ఉపాధ్యాయ సాధికారత || SIET , SRC , RIEs , MRC || perspective education practice bits ||

Описание к видео ఉపాధ్యాయ సాధికారత || SIET , SRC , RIEs , MRC || perspective education practice bits ||

ఉపాధ్యాయ సాధికారత
( Practice bits basesd on textbooks )


56) answer : ( c ) SIET

Explanation : కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ ( CIET ) గురించి last classes లో నేర్చుకున్నాం. కేంద్ర స్థాయిలో ఈ CIET లాగానే రాష్ట్ర స్థాయిలో పనిచేసే సంస్థ SIET. రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ ( SIET ).దీనిని 1985 లో హైదరాబాద్ లో స్థాపించారు.బోధనలోని ఆధునిక ధోరణులను ఉపాధ్యాయులకు పరిచయం చేస్తూ ఉపాధ్యాయ సాధికారతకు కృషి చేస్తోంది ఈ సంస్థ



57) answer :( a ) రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ

Explanation : SIET నే రాష్ట్ర దృశ్య శ్రవణ వికాస కేంద్రం అనికూడా అంటారు.జాతీయ స్థాయి సంస్థ CIET నమూనాలోనే ఇది పనిచేస్తుంది.


58) answer :( b ) SIET

Explanation : రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (SIET ) పిల్లల కోసం వివిధ రకాల కార్యక్రమాలు రూపొందించి " టెలిస్కూల్ " అనే పేరుతో దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తోంది.దీని ద్వారా పాఠ్యంశాలకు, సహ పాఠ్యంశాలకు వేరువేరు కార్యక్రమాలు అలాగే ఉపాధ్యాయులకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా రూపొందించి ప్రసారం చేస్తున్నారు.



59) answer : ( c) SRC

Explanation : సంపూర్ణ అక్ష్యరాస్యత సాధనే ప్రధాన ధ్యేయంగా హైదరాబాద్ లోని " ఆంధ్ర మహిళా సభా ప్రాంగణం " లో ప్రారంభించిన సంస్థ......రాష్ట్ర వనరుల కేంద్రం ( SRC ).


60) answer : ( c) SRC

Explanation :
వయోజన విద్యా వ్యాప్తికి, వయోజన విద్యకు సంబంధించి వాచకాల రచన, క్షేత్ర స్థాయి సిబ్బందికి గైడ్ లైన్స్ ఉన్న కరపత్రాల ముద్రణతో పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్న సంస్థ రాష్ట్ర వనరుల కేంద్రం.



61) answer : ( d ) RIE

Explanation : దక్షిణాది రాష్ట్రాలు అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు etc.....రాష్ట్రాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణా తరగతులు , పునశ్చరణ తరగతులు కూడా నిర్వహిస్తున్న సంస్థ RIE ( Regional Institute of Education ). విద్యారంగంలో పరిశోధనలు నిర్వహించి , బోధనాభ్యసన ప్రక్రియ నాణ్యతకు కృషిచేస్తూ , ఉపాధ్యాయ లోకానికి మార్గదర్శనం చేస్తోంది RIE.



62) answer : ( d ) RIE

Explanation :
🔹RIE - ప్రాంతీయ విద్యా సంస్థలు ( Regional Institute of Education )
🔹NCERT కి అనుబంధంగా కాశ్మిర్ , షిల్లాంగ్, భువనేశ్వర్, భోపాల్ , మైసూర్ లలో RIE లు ఏర్పాటు చేశారు.
🔹 దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన RIE మైసూర్ లో ఉంది. ఇది వృత్తి పూర్వ శిక్షణ ( B. Ed, M . Ed....) తో పాటు ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను కూడా అందజేస్తోంది.



63) answer : ( c ) మండల వనరుల కేంద్రం ( MRC )

Explanation : MRC లు మండల స్థాయిలో , ఉపాధ్యాయ కేంద్రం స్థాయిలో, పాఠశాల సముదాయం స్థాయిలో శిక్షణా శిబిరాలు నిర్వహించడం, ఆదర్శ పాఠ్య బోధన చేయించటం, మూల్యాంకనా పద్ధతులలో శిక్షణ ఇవ్వటం చేస్తున్నాయి.



64) answer : (a) MRC

Explanation : మండల స్థాయిలో ప్రాధమిక విద్యా కార్యకలాపాల పటిష్టత అమలుకు అవసరమైన వాటిని సిద్ధం చేస్తూ ఉపాధ్యాయ సాధికారతకు కృషి చేస్తోంది మండల వనరుల కేంద్రం ( MRC ). ఈ MRC లు MEO ల పర్యవేక్షణ లో మండల స్థాయిలో విషయ నిపుణులైన ( MRP ) ఉపాధ్యాయులతో నిర్వహించబడుతోంది.


65) answer : ( a ) i-b ii- c iii- d iv- a

Explanation : ఉపాధ్యాయ సాధికారత కోసం వివిధ స్థాయిలలో అనేక రకాల సంస్థలు పనిచేస్తున్నాయి. వాటిలో కొన్ని....
🔹 కేంద్ర స్థాయిలో - NCTE , NCERT , CIET , CIEFL
(or) EFLU......
🔹ప్రాంతీయ స్థాయి - RIEs
🔹రాష్ట్ర స్థాయిలో - SIET , SCERT , SRC....
🔹జిల్లా స్థాయిలో - DIET
🔹మండల స్థాయిలో - MRC.....

Комментарии

Информация по комментариям в разработке