తక్కువ ఖర్చుతో అన్నవరం వెళ్ళేవాళ్ళ కోసం స్వామి వ్రతము, రూమ్స్, ట్రైన్ వివరాలు

Описание к видео తక్కువ ఖర్చుతో అన్నవరం వెళ్ళేవాళ్ళ కోసం స్వామి వ్రతము, రూమ్స్, ట్రైన్ వివరాలు

వ్రతం ticket 300 rupees
room for 24hours ₹500
gudur to annavaram:
tirumala express ₹315(sleeper)
Puri express ₹325( sleeper)


శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం, లేదా అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా లోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ-వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది.విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణకు ఈ ఆలయం అంకితం చేయబడింద

కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై తుని నగరానికి 18 కి.మీ.ల దూరంలో.. కాకినాడ నగరానికి 45 కి.మీ.ల దూరంలో.. రాజమహేంద్రవరానికి 80 కి.మీ.ల దూరంలో.. విశాఖపట్నం నుంచి 120 కి.మీ.ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వేస్టేషన్‌ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం.. రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు.
స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి, మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి కొండ, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దూరు ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు ఇతనికి, రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియ, మఖ నక్షత్రం, గురువారం నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారం ప్రతిష్టించి సేవించుం" అని చెప్పి మాయమయ్యారని కథనం

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు (కృష్ణకుటజం) కింద పొదలో స్వామి వారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 న (శాలివాహన శకం 1813) ప్రతిష్ఠించారు.

1970లో ఆలయం మీద పిడిగు పడి ఆలయవిమాన గోపురం పగులుబారటంతో రుద్రాక్షమడపం మీద పగులువారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ్జ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైటు నిర్మాణాలు చేపట్టారు. ఈ పనుల కొరకు తమిళనాడు నుండి 1000 టన్నుల గ్రానైట్ తీసుకువచ్చారు. దిగువ, మొదటి అంతస్తుకు 900 టన్నుల గ్రానైటు రాయి ఉపయోగించారు. పునర్నిర్మాణానికి ముందు చిన్నదిగా ఉన్న గర్భాలయాన్ని కొంచం విశాలంచేసి ఆలయ ప్రధాన ద్వారం పెద్దదిచేసి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. దిగువన ఉన్న యంత్రమందిరం కూడా విశాలం చేశారు.

సత్యనారాయణస్వామి శ్లోకం:
శ్రీ సత్యనారాయణ స్వామివారిని

"మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు.


దర్శన వేళలు:
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దర్శన సమయంలో విరామం: రోజూ స్వామివారికి మహానివేదన కోసం... మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 30 నిమిషాల పాటు దర్శనాలు ఆపేస్తారు. నివేదన అనంతరం మళ్లీ కొనసాగిస్తారు.

ప్రత్యేక పూజలు వివరాలు:
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తారు.
సాధారణ వ్రతమైతే రూ. 150, ప్రత్యేక వ్రతమైతే రూ.300, ధ్వజస్తంభం వద్ద చేసేందుకు రూ. 700, విశిష్ట వ్రతమైతే.. రూ. 1500 చొప్పున రుసుం చెల్లించాలి
వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు, అరటిపళ్లు తీసుకొస్తే సరిపోతుంది. మిగతా పూజా సామగ్రి ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు తదితర పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చుతుంది. వ్రతకర్తలైన భార్యాభర్తలతో పాటు వారి పిల్లల్ని అనుమతిస్తారు.


similar searching:
annavaram temple
annavaram
annavaram prasadam
annavaram godumaravva prasadam
godumaravva prasadam
bhangi prasadam
annavaram annnadanam
popular temples in ap
kakinada most popular temples
annavaram Satyanarayana Swami
annavaram prasadam making
samarla Kota junction
gudur junction
annavaram train
annavaram train details
annavaram free bus
annavaram temple bus
annavaram kalinadaka margam
annavaram ki thakkuva karchutho
annavaram train details thakkuva karchutho
annavaram free room details
annavaram temple bus cost
less budget annavaram trip
annavaram trip details
annavaram temple trip
ratnagiri temple
Satyanarayana vratham
pampa Nadi
pampa river

Комментарии

Информация по комментариям в разработке