రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు | హోం మంత్రి అనిత సమీక్ష | Minister Anitha Video Conference On Rains

Описание к видео రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు | హోం మంత్రి అనిత సమీక్ష | Minister Anitha Video Conference On Rains

రాష్ర్టవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లతో రాష్ట్ర హోమ్, విపత్తు నిర్వహణా శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరద ప్రవాహ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపులపై మంత్రి కలెక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. పాత భవనాల్లో రిలీఫ్ క్యాంపులు పెట్టొద్దని ఆదేశించారు. కాజా టోల్ గేట్ వద్ద జాతీయ రహదారి పై నీరు నిలిచినట్టు గుంటూరు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం క్రమంగా నీరు తగ్గుతోందని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా లోని విజయవాడ, మైలవరంలో 25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు అయ్యిందని కలెక్టర్ సృజన వెల్లడించారు. 20 ఏళ్లలో విజయవాడ , పరిసర ప్రాంతాలలో ఇదే గరిష్ట వర్షపాతం అని పేర్కొన్నారు. బుడమేరులో భారీగా వరద వస్తోందని... 1100 మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించినట్టు వెల్లడించారు. కొండచరియలు విరిగిన ఘటనలో ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మొఘల్ రాజపురం, వన్ టౌన్ కొండ ప్రాంతాల్లోని ప్రజల్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హోమ్ మంత్రి అనిత ఆదేశించారు. NDRF, SDRF బృందాల్ని తక్షణమే పంపుతున్నట్టు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.7 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. విశాఖ - కళింగపట్నం మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке