వినాయక చవితి స్పెషల్ చొంబొ | Chintapandu Pulihora | Undralla Payasam | Ganesh Chaturthi Special

Описание к видео వినాయక చవితి స్పెషల్ చొంబొ | Chintapandu Pulihora | Undralla Payasam | Ganesh Chaturthi Special

వినాయక చవితి స్పెషల్ చొంబొ | Chintapandu Pulihora | Undralla Payasam | Ganesh Chaturthi Special | Paal Kozhukattai | Tamarind Rice | ‪@HomeCookingTelugu‬

#pulihora #homecookingtelugu #chintapandupulihora #templestylepulihora #paalkozhukattai #undrallapayasam

Chapters:-
Promo - 00:00
How to make Chintapandu Pulihora - 00:13
How to make Undralla Payasam - 06:45


మసాలా పొడి చేయడానికి కావలసిన పదార్థాలు:

ధనియాలు - 1 టేబుల్స్పూన్
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
మిరియాలు - 1 / 2 టీస్పూన్
మెంతులు - 1 / 4 టీస్పూన్
నువ్వులు - 1 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 5
ఇంగువ - 1 / 4 టీస్పూన్

చింతపండు పులుసు చేయడానికి కావలసిన పదార్థాలు:

నూనె - 4 టేబుల్స్పూన్లు
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
వేరుశనగ గుళ్ళు - 1 టేబుల్స్పూన్
ఆవాలు - 1 / 2 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 4
ఇంగువ - 1 / 4 టీస్పూన్
కరివేపాకులు
పసుపు - 1 / 2 టీస్పూన్
కల్లుప్పు - 2 టేబుల్స్పూన్లు
బెల్లం పొడి - 1 1 / 2 టీస్పూన్లు
పొడి పట్టిన మసాలా

తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 1 గంట
సెర్వింగులు: 6

ఉండ్రాళ్ళు చేయడానికి కావలసిన పదార్థాలు:

బియ్యప్పిండి - 1 / 2 కప్పు
ఉప్పు - చిటికెడు
నెయ్యి - 1 టీస్పూన్
వేడి నీళ్ళు

పాయసం చేయడానికి కావలసిన పదార్థాలు:

పాలు - 1 1 / 2 కప్పులు
నీళ్లు - 1 / 2 కప్పు
బెల్లం - 200 గ్రాములు
యాలకుల పొడి - 1 టీస్పూన్
చిక్కటి కొబ్బరి పాలు - 1 1 / 2 కప్పులు

తయారుచేసే విధానం:

* ముందుగా ఒక పెద్ద బౌల్లో బియ్యప్పిండి, ఉప్పు, నెయ్యి వేసిన తరువాత, వేడి నీళ్లను కొద్దికొద్దిగా వేసుకుంటూ, పిండిని కలుపుకుంటూ, పిండిముద్దని తయారుచేసుకోవాలి
* పిండి కాస్త దగ్గరపడి గట్టిగా అయిన తరువాత, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి
* ఇప్పుడొక వెడల్పాటి పాన్లో పాలు, నీళ్లు పోసి బాగా మరిగించాలి
* పాలల్లో ఒక ఉడుకు వచ్చిన తరువాత తయారుచేసిన ఉండ్రాళ్ళని వేసుకోవాలి
* ఇప్పుడు పాన్కు మూత పెట్టి, పదిహేను నిమిషాలు పాలను, ఉండ్రాళ్ళను కలిపి ఉడికించాలి
* ఇంకొక సాస్పాన్లో నీళ్లు పోసి అందులో బెల్లం వేసి పూర్తిగా కరిగించాలి
* బెల్లం కరిగిన తరువాత పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు మరిగించాలి
* ఆ తరువాత పొయ్యి కట్టేయచ్చు
* పదిహేను నిమిషాల తరువాత చూస్తే పాలు చాలా చిక్కగా అవుతాయి, వీటిని ఒకసారి కలిపిన తరువాత, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి
* పొయ్యిని లో-ఫ్లేములో ఉంచి, చిక్కటి కొబ్బరి పాలను పోసుకోవాలి
* వీటన్నిటినీ కలిపి ఒక ఐదు నిమిషాలు మరిగించిన తరువాత, పొయ్యి కట్టేయచ్చు
* ఇప్పుడు బెల్లం పాకాన్ని వడకట్టి, పాలల్లో వేసి కలపాలి
* అంతే, అద్భుతంగా ఉండే ఉండ్రాళ్ళ పాయసం తయారైనట్టే, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK -   / homecookingtelugu  
YOUTUBE:    / homecookingtelugu  
INSTAGRAM -   / homecookingshow  

A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке