తూర్పు దేశపు జ్ఞానులు THOORPU DESHAPU GNANULU. MESSAGE BY NAMA RAJASHEKAR,THUNGAPAHAD

Описание к видео తూర్పు దేశపు జ్ఞానులు THOORPU DESHAPU GNANULU. MESSAGE BY NAMA RAJASHEKAR,THUNGAPAHAD

THE SWORD OF GOD
THE CHURCHES OF LIVING GOD,
WHICH IN THUNGAPAHAD & CHITTALUR ARE IN JESUS CHRIST
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు వందనాలు...
ఈ సందేశాలను అందరికి షేర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్థులు అవ్వండి..
మరిన్ని వర్తమానాల కోసము ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి..
ఆత్మీయ వర్తమానముల ద్వారా సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సుగలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును గాక. 2కొరింథీయులకు13:11


మీ ఆత్మీయ సహోదరుడు..
నామ రాజశేఖర్
తుంగపహాడ్ గ్రామము
మిర్యాలగూడ మండలము
నల్లగొండ జిల్లా
తెలంగాణ రాష్ట్రము.

లూకా 2: 23
ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును,
లూకా 2: 24
ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి.
మత్తయి 2: 1
రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
మత్తయి 2: 2
యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
మత్తయి 2: 3
హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.
మత్తయి 2: 4
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.
మత్తయి 2: 5
అందుకు వారుయూదయ బేత్లెహేములోనే; ఏలయనగాయూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వరా వ్రాయబడియున్నదనిరి.
మత్తయి 2: 6
అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
మత్తయి 2: 7
ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని
మత్తయి 2: 8
మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి,ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.
మత్తయి 2: 9
వారు రాజు మాటవిని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.
మత్తయి 2: 10
వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి,
మత్తయి 2: 11
తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
మత్తయి 2: 12
తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.
మత్తయి 2: 16
ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను.
మత్తయి 12: 42
విమర్శ సమయమున దక్షిణదేశపు రాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
కీర్తనలు 72: 1
దేవా, రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము.
కీర్తనలు 72: 2
నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును.
కీర్తనలు 72: 8
సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును.
కీర్తనలు 72: 10
తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించె దరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు.
కీర్తనలు 72: 15
అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగడుదురు.
యెషయా 60: 1
నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.
యెషయా 60: 2
చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది
యెషయా 60: 4
కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.
యెషయా 60: 6
ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటె లును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.

Комментарии

Информация по комментариям в разработке