వెల్దుర్తి లో మహిళలపై కర్రలతో దాడి చేసిన మధుకృష్ణ, మధువిక్రమ్ లను వెంటనే అరెస్టు చేయాలి || KURNOOL

Описание к видео వెల్దుర్తి లో మహిళలపై కర్రలతో దాడి చేసిన మధుకృష్ణ, మధువిక్రమ్ లను వెంటనే అరెస్టు చేయాలి || KURNOOL

యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక డిమాండ్ చేశారు మహిళలకు రక్షణ కల్పించాలని....

మధుకృష్ణ , మధు విక్రమ్ లను తక్షణమే అరెస్టు చేయాలి.
యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక డిమాండ్._

బంగారు జయలక్ష్మీ ఆమె తల్లి గోరంట్లమ్మ లపై హత్యాయత్నం చేసిన మధుకృష్ణ, మధు విక్రమ్ లను తక్షణమే అరెస్టు చేయాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. మహిళలు రక్షణ విషయమై ఈ రోజు వెల్దుర్తి పోలీసు స్టేషనుకు వెళ్ళి పోలీసులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ వెల్దుర్తి మండలం లక్ష్మీపురం (ఎల్.బండ) గ్రామానికి చెందిన మధుకృష్ణ కుమారుడు మధు విక్రమ్ అదే గ్రామానికి చెందిన మేనత్త కూతురు అయిన బంగారు జయలక్ష్మీ లు ఇద్దరూ ప్రేమించి పది సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు.వారికి ముగ్గురు పిల్లలు సంతానం. జయలక్ష్మి అంగన్వాడీ ఆయా గా, మధు విక్రమ్ కరెంట్ లైన్ మెన్ గా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు. జయలక్ష్మీ పై అనుమానంతో భర్త మధు విక్రమ్, కట్నం లేకుండా కొడుకును పెళ్ళి చేసుకుందని మామ మధుకృష్ణ అత్త, మరియు చిన్నత్త లు కలిసి నిత్యం జయలక్ష్మీ ని వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. అత్తింటి వేధింపులు తట్టుకోలేక జయలక్ష్మీ అక్టోబరు నెల 2023 న వెల్దుర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేశారు. మాపై కేసు పెడతావా అన్న కోపంతో జయలక్ష్మీ పై ఆమె భర్త మధు విక్రమ్ పలుమార్లు దాడులు చేయడం, పోలీసులు నచ్చజెప్పి పంపడం జరుగుతూ వస్తోంది. ఇది అలుసుగా తీసుకున్న మధుకృష్ణ , పీర్ల పండుగ రోజున 16.7.2024 వ తేదీ సాయంత్రం సుమారు 7.00 గంటల ప్రాంతంలో జయలక్ష్మీ , ఆమె తల్లి గోరంట్లమ్మ లపై పట్టుడు కర్రతో దాడి చేసి తల పగులగొట్టి చంపడానికి ప్రయత్నించాడు.దాడిలో గోరంట్లమ్మ కు తల పగిలి 16 కుట్లు పడ్డాయి. జయలక్ష్మీకి రక్తం గడ్డకట్టిన కందుడు గాయాలు అయ్యాయి. పోలీసులు మాత్రం యథావిధిగా కేసు కట్టి చేతులు దులుపు కున్నారు. బాధితులు జయలక్ష్మీ , తల్లి గోరంట్లమ్మ లు భయంతో ఊరు విడిచి బంధువుల ఊర్లో బిక్కు బిక్కు మంటూ తలదాచుకుంటున్నారని ఆమె తెలిపారు. జయలక్ష్మీ భర్త మధు విక్రమ్, మామ మధుకృష్ణ లను తక్షణమే అరెస్టు చేయాలని, బాధిత మహిళలకు రక్షణ కల్పించాలని పట్నం రాజేశ్వరి పోలీసులను డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె అన్నారు.

Комментарии

Информация по комментариям в разработке