న్యూరోపతిక్ నొప్పి: లక్షణాలు, కారణాలు, చికిత్స, మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Medicover Hospitals

Описание к видео న్యూరోపతిక్ నొప్పి: లక్షణాలు, కారణాలు, చికిత్స, మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Medicover Hospitals

న్యూరోపతిక్ నొప్పి: లక్షణాలు, కారణాలు, చికిత్స, మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Medicover Hospitals

డా. సుమేధ మాటూరు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, ఈ వీడియో లో న్యూరోపతిక్ నొప్పి గురించి పూర్తిగా వివరించారు.

0:00 - న్యూరోపతిక్ నొప్పి

నొప్పి మన శరీరంలో పలు భాగాల నుండి, పలు కారణాల వల్ల ఉత్పత్తి అవ్వచ్చు. మన చర్మానికి గాయం అవ్వడం వల్ల కానీ, చర్మం కింద ఉన్న కండరాల కి గాయం అవ్వడం వల్ల కానీ, కండరాల మధ్య ఉన్న నరాల వల్ల కానీ, ఎముక విరిగిపోవడం వల్ల కానీ, శరీరం లో ఒక అవయవానికి రక్త శ్రావం ఆగిపోవడం వల్ల కానీ నొప్పి రావచ్చు. ఇలా నొప్పి అనేది అనేక కారణాల వల్ల వస్తుంది, సాధారణంగా అందరూ ఈ నొప్పులను నరాల నొప్పులుగా వ్యక్తం చేస్తారు, కానీ ఇవన్నీ నరాల నొప్పులు కావు.

0:43 - న్యూరోపతిక్ నొప్పి అంటే ఏమిటి?
ఒక నరానికి జరిగిన నష్టం వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఒత్తిడి వల్ల కానీ, వచ్చిన నొప్పిని మాత్రమే నరాల నొప్పి లేదా న్యూరోపతిక్ నొప్పి అని అంటారు.

0:53 - నరాల నొప్పి యొక్క లక్షణాలు:
నరాల నొప్పులు మొదలైనప్పుడు అరి చేతుల్లో కానీ, అరి కాళ్లల్లో కానీ రాత్రుల్లో నొప్పి ఎక్కువగా వస్తుంది
నొప్పి తీవ్రత పెరుగుతున్నప్పుడు అది పగలు కూడా రావడం జరుగుతుంది
ఈ నొప్పులు సూది గుచ్చినట్లు, మంట లాగ, కత్తి పోటు లాగ వస్తాయి
దీర్ఘకాలంగా నరాల నొప్పి తో బాధ పడుతున్న వారికి, ఎన్ని మందులు వాడిన తగ్గట్లేదు అని నిరాశతో, మనుషుల ప్రవర్తన లో మార్పు రావడమో, ఆందోళన, చిరాకు, ఇలా అనేక వాటికి దారి తీస్తాయి.

1:40 - న్యూరోపతిక్ నొప్పులు రావడానికి కారణాలు ఏమిటి?
ఈ న్యూరోపతిక్ నొప్పులు అనేవి కొత్తగా మొదలవుతున్నాయి అన్నప్పుడు, డయాబెటిస్ ఏమైనా ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. న్యూరోపతిక్ నొప్పులు ఎక్కువగా డయాబెటిస్ ఉన్న వారికే వస్తుంది
డయాబెటిస్ లేని వారికి న్యూరోపతిక్ నొప్పులు వచ్చినప్పుడు, ముందుగా రెండు చేతులకి, రెండు కాళ్ళకి సంబంధించి నరాల ప్రసరణ పరీక్ష, ఎలక్ట్రోఫిజియాలజీ పరీక్షా, బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకోవాలి
వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా అని చూసుకోవాలి, బ్లడ్ కి సంబంధించిన క్యాన్సర్ వంటివి కూడా న్యూరోపతి నుండి బైట పడే అవకాశాలు ఉన్నాయి.

2:48 - న్యూరోపతిక్ నొప్పులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
నరాలకు సంబంధించి ఇలా ఏమైనా లక్షణాలు ఉంటే, ఆలస్యం చేయకుండా న్యూరాలజిస్ట్ ని కలవాలి
న్యూరాలజిస్ట్ ని కలిసాక, వైద్యుల సలహా మేరకు, ఇంజెక్షన్ రూపంలో కానీ, మాత్రల రూపం లో కానీ, లేపనం రూపం లో కానీ, చర్మం పాచ్ రూపంలో కానీ మెడికేషన్ ప్రారంభించాలి.
నొప్పి చాలా తీవ్రంగా ఉంది అనుకుంటే, ఏ భాగంలో అయితే న్యూరోపతిక్ నొప్పులు వస్తున్నాయో, దానికి సంబంధించిన నరాలని తాత్కాలికంగా బ్లాక్ చేసుకోవడానికి, నర్వ్ బ్లాక్ లాంటివి వాడుకోవచ్చు
ఫిజియోథెరపీ వంటివి చేయించుకోవాలి
ఇంట్లో ఉన్న వాళ్ళు నొప్పి తగ్గించుకోడానికి, హాట్ ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ వంటివి పెట్టుకోవచ్చు
శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి చేయాలి
నొప్పి వస్తుంది కదా అని ఒక్క చోట కూర్చోకుండా, సాయంత్రం సమయాల్లో ఆక్టివ్ గా ఉండాలి
న్యూరోపతిక్ వైద్యులను తరుచుగా సంప్రదిస్తూ ఉండాలి.

మరిన్ని వివరాల కోసం వీడియో ని పూర్తిగా వీక్షించండి!

#NeuropathicPain #NervePain #MedicoverHospitals

For Appointments, Call 040-69024455 or
WhatsApp - 7032313999

Visit: https://www.medicoverhospitals.in/

►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News & more.

Follow us on Other Platforms:
Facebook:   / medicoverhospitals  
Instagram:   / medicoverhospitals  
Twitter:   / medicoverin  
Linkedin:   / medicoverhospitals  

Комментарии

Информация по комментариям в разработке