BRS MLAs Defection Case Adjourned for Today | పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు విచారణ ఇవాళ్టికి వాయిదా

Описание к видео BRS MLAs Defection Case Adjourned for Today | పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు విచారణ ఇవాళ్టికి వాయిదా

పార్టీ మారిన ఎమ్మెల్యేలకేసుపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలుచేసిన అప్పీలుపై మరోసారి...హైకోర్టులో విచారణ సాగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన MLAలపై చర్యలు తీసుకోవాలంటూ BRS ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్ గౌడ్ , పాడికౌశిక్ రెడ్డి సహా BJP శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటీషన్ దాఖలుచేశారు. ఆ పిటిషన్ పై విచారణ నిర్వహించిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి గత సెప్టెంబర్ లో తీర్పు వెలువరించారు. పార్టీమారిన MLAలపై అందినఫిర్యాదులను స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. నెలలోపు విచారణ తేదీలు నిర్ణయించి హైకోర్టు రిజిస్ట్రీకి సమాచారమివ్వాలని ఉత్తర్వుల్లోన్యాయమూర్తి పేర్కొన్నారు. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. సభాపతి నిర్ణయాల్లోహైకోర్టు జోక్యం చేసుకోకూడదని అప్పీల్ లో పేర్కొన్నారు. పిటీషన్లు దాఖలుచేసిన ఎమ్మెల్యేలని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫున ప్రభాకర్ రావు వాదనలు వినిపించారు. సమయం ముగియడంతో విచారణ రేపటికి వాయిదా పడింది
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке