నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా.. Neeli Meghamaa Jaali Choopumaa...

Описание к видео నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా.. Neeli Meghamaa Jaali Choopumaa...

చిత్రం: అమ్మాయిల శపథం (1975)
స్వర కల్పన: విజయ్ భాస్కర్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.పి.బాలుడు, వాణీ జయరాం

పల్లవి:

నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా

కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా

చరణం:

ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే

కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా
రా.. జాబిలి నా నెచ్చలి.. జాగేల... ఈ వేళ.. నను చేరగా

నీలి మేఘమా జాలి చూపుమా.. ఒక నిముషమాగుమా
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా..ఆ....

చరణం:

కళ్యాణ మేళాలు మ్రోగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా
కళ్యాణ మేళాలు మ్రోగించనా..
కంఠాన సూత్రాన్ని ముడివేయనా..

గుండె గుడిగా చేయనా.. నిన్ను కొలువు తీర్చనా
నీ దాసినై... సావాసినై... నా ప్రేమ పుష్పాల పూజించనా...

కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా....

Neeli Meghama Lyrics - Ammayila Sapatham (1974) - Telugu Movie Song

neeli mEghamaa jaali choopumaa oka nimishamaagumaa
naa raajutO ee raatiri nannu kalipi veLLumaa
kanne andamaa kalata maanumaa oka nimishamaagumaa
nee daivamu nee kOsamu yeduTa niliche chooDumaa

aanukOni raagaalu vinipinchE
kanaraani swargaalu digivacchEnE
aanukOni raagaalu vinipinchEnE
kanaraani swargaalu digivacchEnE
kalalu panDi nijamugaa kanula yeduTa nilichegaa
raa jaabili naa necchali jaagEla ee vELa nanu cheragaa

neeli mEghamaa..

kaLyaaNa mElaalu mroginchanaa
kanTaana sootraanni muDiveyanaa
kaLyaaNa mElaalu mroginchanaa
kanTaana sootraanni muDiveyanaa
gunDe guDigaa cheyanaa ninnu koluvu teerchanaa
nee daasinai naa vaasivai naa prema pushpaalapoojinchanaa

kanne andamaa...

Комментарии

Информация по комментариям в разработке