అల్లరి కిట్టయ్య Lord Krishna @beautiful song రచన, సంగీతం & గానం: పి.మాధవి lyrics in description

Описание к видео అల్లరి కిట్టయ్య Lord Krishna @beautiful song రచన, సంగీతం & గానం: పి.మాధవి lyrics in description

lordkrishnadevotionalsongs #mannuthintivani gollethalandaru #srikrishna #krishna #srikrishnagovinda #srikrishnabani mannutintivani 1. మన్ను తింటివని గొల్లెతలందరు మాతా యశోదకు విన్నవించగా
దండముతో నిను దండించబోవగా
లోకాల నోట జూపి మాయజేస్తివే
ఎంత మాయలాడివయ్య క్రృష్ణమూర్తీ
నిన్ను ఎట్టా కట్టేయగలముక్రృష్ణమూర్తీ
2. పొరిగింటిలోన పెరుగంత మింగేసి
పరుగు పరుగున నువ్వు పారిపోవగా
ఇరుగు పొరుగు వచ్చి మొరపెట్టుకోగా
గురివింద గింజలాగ జారిపోతివే
3. పక్కింటిలోన పాలన్నీ తాగేసి
పారిపోవగ నీవు క్రృష్ణమూర్తీ
పట్టి తెచ్చి నిన్ను కట్టేయబోవగా
ఎంత తాడు చాలకుండ మాయ చేస్తివే
4. ఎదురింటి లోన ఉట్టి మీద ఉన్న
వెన్నంత కాజేసి క్రృష్ణమూర్తీ
కొత్త కోడలికి మూతి మీద రాసీ
పత్తిత్తులాగ నువ్వు జారుకుంటివే
5. సత్యాదేవి నిన్ను సొంతం చేసుకోగ
తులాభారంలోన పొంద చూడగా
అష్టైశ్వర్యములు వెలవెల బోవగా
తులసీ దళానికే తూగినావయా
ఎంత మాయలాడివయ్య క్రృష్ణమూర్తీ
నీ గుట్టు తెలిసి పోయెనయ్య క్రృష్ణమూర్తీ
నువ్వు భక్తికె లొంగేవయ్య క్రృష్ణమూర్తీ
నిన్ను భక్తితో కట్టేద్దుమయ్య క్రృష్ణమూర్తీ
మా భక్తితో కట్టేద్దుమయ్య క్రృష్ణమూర్తీ

Комментарии

Информация по комментариям в разработке