స్వాధీనం చేసుకున్న మార్గదర్శి చెక్కులు, నగదు విడుదల | Seized Cheques & Cash of Margadarsi Returned

Описание к видео స్వాధీనం చేసుకున్న మార్గదర్శి చెక్కులు, నగదు విడుదల | Seized Cheques & Cash of Margadarsi Returned

విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది... బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. చందాదారులు చెల్లించిన 51 లక్షల 99 వేల 800 నగదు, 36 లక్షల 88 వేల 675 రూపాయల విలువైన 51 అకౌంట్ పేయీ చెక్కుల్ని... ఏప్రిల్ 2న బ్యాంకులో జమ చేసేందుకు మార్గదర్శి సిబ్బంది తీసుకెళ్తుండగా చెకింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. మార్చి 30, 31 తేదీలు శని, ఆదివారాలు కావడం, ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు కావడంతో... చందాదారులు చెల్లించిన మొత్తాన్ని ఏప్రిల్ 2న బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళ్తున్నామని మార్గదర్శి సిబ్బంది తెలిపారు. అన్ని ఆధారాలతో డెయిలీ క్యాష్ రిజిస్టర్ ను అందించినా... చెకింగ్ స్క్వాడ్ పరిగణనలోకి తీసుకోలేదు. మార్గదర్శి సిబ్బంది వద్ద ఉన్న నగదు, చెక్కులను సీజ్ చేశారు. మార్గదర్శి యాజమాన్యం ఈ విషయాన్ని ఆదాయపన్ను విభాగం, రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఖాతాదారులు జమ చేసిన నగదుకు రసీదులు, అంతకుముందు 10 రోజుల బ్యాంకు లావాదేవీల స్టేట్ మెంట్లు సహా ఆధారాలన్నీ అందజేసింది. వాటిని పరిశీలించిన ఐటీ విభాగం... మార్గదర్శి సంస్థకు చెందిన నగదు, చెక్కుల్ని సీజ్ చేయడం సరికాదని స్పష్టంచేసింది. ఆ మేరకు ఐటీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ రాజీవ్ రమేష్.... ఏప్రిల్ 17న కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా రిడ్రెసల్ కమిటీ కన్వీనర్ కు లేఖ రాశారు. పోలీసుల నుంచి దర్యాప్తు నివేదిక తెప్పించుకున్న రిటర్నింగ్ అధికారి... మార్గదర్శి సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కులు విడుదల చేయాలని జిల్లా ట్రెజరీ అధికారికి ఈ నెల ఆరో తేదీన లేఖ రాశారు. ఏడో తేదీన వాటిని మార్గదర్శి సిబ్బందికి అందజేశారు. ఐటీ విభాగం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా చాలా రోజుల సమయం తీసుకున్నారు. ఈ ఘటనపై సాక్షి మీడియా అడ్డగోలుగా దుష్ప్రచారం చేసింది. ఆ డబ్బును ఒక ప్రధాన పార్టీ అభ్యర్థులకు చేరవేసేందుకే తీసుకెళుతున్నారంటూ మరో అసంబద్ధ ఆరోపణను జోడించింది. డబ్బులు, చెక్కులు తిరిగి అప్పగించాలన్న ఐటీ విభాగం ఆదేశాలు.... సాక్షి పిచ్చిరాతలకు చెంపపెట్టులా మారాయి
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке