రైస్ మిల్లర్స్అసోసియేషన్ అధ్యక్షుడుగా "వంటిపల్లి పాపారావు" ప్రమాణ స్వీకారం

Описание к видео రైస్ మిల్లర్స్అసోసియేషన్ అధ్యక్షుడుగా "వంటిపల్లి పాపారావు" ప్రమాణ స్వీకారం

#prmediaapupdates
#news
#kothapeta
#డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
#కొత్తపేటనియోజకవర్గం


రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం...

అసోసియేషన్ అధ్యక్షుడు వంటిపల్లి పాపారావు...

(కొత్తూరు సెంటర్)

కొత్తపేట నియోజకవర్గంలోని రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అసోసియేషన్ కు నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వంటిపల్లి పాపారావు పేర్కొన్నారు. కొత్తపేట నియోజకవర్గం రైస్ మిల్లర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ ఎస్ జె ఆర్ కళ్యాణ మండపంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ కెవి సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. గౌరవ అధ్యక్షులుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అధ్యక్షునిగా శ్రీ మురళీకృష్ణ రైస్ మిల్ అధినేత వంటిపల్లి పాపారావు, ఉపాధ్యక్షులుగా రాయుడు సుభాకర్, సయ్యపురాజు బంగార్రాజు, కార్యదర్శిగా సత్తి బామిరెడ్డి, కోశాధికారిగా వెచ్చ కోట సూర్యప్రకాశరావు, జాయింట్ సెక్రటరీగా ఉండమట్ల పరమేష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నదాతల కష్టాలను తీర్చేందుకు ఉమ్మడి ఎన్ డి ఏ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయోజనంతో కూడిన కార్యక్రమాలు చేపట్టపడుతుందని అన్నారు. మరో ముఖ్య అతిథిగా మాజీ శాసనమండలి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ మానవుడు సంఘజీవని ఒంటరిగా సాధించలేనిది సంఘం ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించి సాధించవచ్చునని రైస్ మిల్లర్లు అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామమని, అయితే జిల్లా స్థాయిలో కూడా ఓ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ నాటి ప్రభుత్వ విధి విధానాలతో రైస్ మిల్లర్లు అనేక ఇబ్బందులకు గురయ్యారని ఎన్డీఏ ప్రభుత్వం రైతులతో పాటు రైస్ మిల్లర్లకు కూడా లాభసాటి విధానాలు అమలు చేయబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ యువ నాయకులు బండారు సందీప్, పలువురు రైస్ మిల్లర్ల అధినేతలు, ఎన్డీఏ కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Комментарии

Информация по комментариям в разработке