Naa jeevithana kurisene nee ॥నా జీవితాన కురిసెనే నీ కృపామృతంత పాస్టర్.జాన్ వెస్లీ

Описание к видео Naa jeevithana kurisene nee ॥నా జీవితాన కురిసెనే నీ కృపామృతంత పాస్టర్.జాన్ వెస్లీ

#Hosannaministries

నా జీవితాన కురిసెనే నీ కృపామృతం
నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం } 2
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను } 2

నీ దయ నుండి దూరము కాగా
ప్రేమతో పిలిచి పలుకరించితివే } 2
కృపయే నాకు ప్రాకారము గల – ఆశ్రయపురమాయెను
నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను || నా జీవితాన || } 2

నా యేసయ్యా – నీ నామమెంతో
ఘనమైనది – కొనియాడదగినది } 2
కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది || నా జీవితాన || } 2

నీ సన్నిధిని నివసించు నాకు
ఏ అపాయము దరిచేరనివ్వవు } 2
కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను
నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను || నా జీవితాన || } 2

Комментарии

Информация по комментариям в разработке