Organic Lemon Farming by Mallareddy | ZBNF | contact-7799273612

Описание к видео Organic Lemon Farming by Mallareddy | ZBNF | contact-7799273612

Farmer #Mallareddy who belongs to Munnangivaripalem village, chunduru mandal, Guntur District, AP cultivating #lemon trees since 7 years. He completely fallows #ZBNF method for his lemon trees. He uses #bio pesticides like jeevamrutham, neemastram, agniastram and #bio fertilizers like Ghana jevamrutham, cow waste to protect lemon trees from pests and insects. The #AP state Government also promoting ZBNF to protect farming lands from chemicals and pesticides and to help farmers to reduce the crop investiments.


వ్యవసాయం.. ‍! అందరికీ అన్నంపెట్టే సమున్నత రంగం. ఇందులో రైతన్న శ్రమే ప్రధాన పెట్టుబడి. అన్నదాత చిందించే స్వేదమే పంటలకు ప్రాణం పోస్తుంది. అలాగే.. సమగ్ర పోషక విలువలతో కూడిన ఎరువులతోనే రైతన్నకు మంచి దిగుబడి అందుతుంది. పంటలకు బలాన్ని ఇచ్చే ఆ సమగ్ర పోషక విలువలు కలిగి ఉండే అన్నదాత నేస్తాలు మన చుట్టే ఉంటాయి. అవే.. గో వ్యర్థాలు, సహజ కషాయాలు, పంట వ్యర్థాలు. వీటిని సరైన రీతిలో వినియోగిస్తు చేసేదే... ప్రకృతి వ్యవసాయం. నేడు... ఈ తరహాలో పంటలను సాగు చేస్తు అనేక మంది రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. గుంటూరు జిల్లా చుండూరు మండలం మున్నంగివారి పాలెం గ్రామానికి చెందిన ప్రాకృతిక రైతు మల్లారెడ్డి వారిలో ఒకరిగా నిలుస్తున్నారు.

మల్లారెడ్డి.. 7 ఏళ్ల నుంచి నిమ్మ తోట సాగు చేస్తున్నారు. మొదట రసాయనాలు వినియోగించారు. పెట్టుబడులు భారమయ్యాయి. ఈ సమయంలోనే సహజ వ్యవసాయం గురించి తెలుసుకున్న మల్లారెడ్డి.. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లారు. రెండేళ్ల నుంచి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అంటే.. ఈ పద్ధతిలో రైతులే స్వయంగా ఎరువులను తయారు చేసుకుంటారు. గో వ్యర్థాలు, సహజ కషాయాలు, చెట్ల ఆకుల మల్చింగ్ వంటి వాటితో పంటలకు కావాల్సిన పోషకాలను అందిస్తారు. తద్వారా పెట్టుబడి గణనీయంగా తగ్గి రైతుకి నికర ఆదాయం పెరుగుతుంది. ఈ విధానంలోనే రైతు మల్లారెడ్డి నిమ్మ తోట ద్వారా ఏటా ఎకరానికి లక్ష రూపాయాల నికర ఆదాయం పొందుతున్నారు.

పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో రైతు శ్రమ, ఓపికే కీలకం. పూర్తి నమ్మకంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్న మల్లారెడ్డి.. జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం, పుల్లటి మజ్జిగ, హింగువ ద్రావణం చెట్లకు అందిస్తున్నారు. వీటితోనే తెగుళ్లను నివారిస్తున్నారు.

వ్యవసాయంలో పెట్టుబడులు రైతులకు భారమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో... అన్నదాతను ఆదుకునే ప్రత్యామ్నాయం.. ప్రకృతి వ్యవసాయమే. ప్రకృతి సేద్య పితామహుడు సుభాష్ పాలేకర్ సంకల్పం, స్వచ్ఛంద సంస్థలు, రైతుల కోసం పనిచేస్తున్న ఫౌండేషన్ల కృషితో.. ఇటీవల కాలంలో సహజ సేద్యంపై రైతుల్లో అవగాహన పెరుగుతోంది. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం... ఇటీవల పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 నాటికి రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులని ప్రకృతి సేద్యంలోకి తీసుకురావడం.. తద్వారా ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే తొలి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా నిలబెట్టడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రకృతి సేద్యంలో స్ఫూర్తిగా నిలుస్తోన్న మల్లారెడ్డి వంటి రైతుల కృషి.. ఈ లక్ష్యాన్ని చేరేందుకు దోహదపడుతుందని రైతునేస్తం ఫౌండేషన్ ఆశిస్తోంది.

Комментарии

Информация по комментариям в разработке