# నిన్నుగొలిచెద రావయ్యా - నా యేసన్నా//bible mission gooty songs # ninnu golicheda ravayya song #

Описание к видео # నిన్నుగొలిచెద రావయ్యా - నా యేసన్నా//bible mission gooty songs # ninnu golicheda ravayya song #

నిన్నుగొలిచెద రావయ్యా - నా యేసన్నా నిన్ను గొలిచెద రావయ్యా హృదయ దేవళమందు - ముదమున నిన్ను నిల్పి - భక్తి పుష్పములచే - భజియించి పూజించి|| నిన్ను ||

పాడుకొందును రావయ్యా - నీ ప్రేమను వేడుకొందును రావయ్యా అన్నవస్త్రములకై - అల్ల లాడిన నాకు అన్నా నీ వొసగిన అన్నవస్త్రములకై|| నిన్ను ||

చెప్పు కొందును రావయ్యా - నా పాపంబుల్ ఒప్పుకొందును రావయ్యా - పాపక్షమాపణ - శాపవిమోచన పాప బంధితు నాకు - చూపిన ప్రేమకై|| నిన్ను ||
శుభ్ర పరచితి రావయ్యా - నా హృదయము భద్రపరచితి రావయ్యా = నీతి సూర్యుడ నీవు ఉదయించునంతనే కుదురౌ - నా ప్రాణము - సదయాత్మ పరమాత్మ|| నిన్ను ||

దాచుకొందును రావయ్యా - నీ రూపము చూచుకొందును రావయ్యా - దోషాత్ముడను నాదు - దోష మంతయు బాపి - రూపమేర్పరచినా - దాపునుండిన రాజా

Комментарии

Информация по комментариям в разработке