Paper, Arecanut, Leaf Plates Making Business | బతుకు బడి

Описание к видео Paper, Arecanut, Leaf Plates Making Business | బతుకు బడి

వివిధ రకాల పేపర్‌ ప్లేట్లు, వక్క మట్టల ప్లేట్లు (అరికానట్), ఇస్తరాకులు తయారు చేస్తున్న ఒక ఇండస్ట్రీ నిర్వహణ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి పట్టణ శివారులో ఈ వ్యాపారం ఏడాదిగా చేస్తున్నారు. ఈ వీడియోలో ఆ సంస్థ నిర్వాహకులైన మొగిలి దుర్గాప్రసాద్ గారు సమాచారం వివరించారు.

మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని [email protected] మెయిల్ ఐడీకి పంపించండి.

కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.

Title : Paper, Arecanut, Leaf Plates Making Business | బతుకు బడి

Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business

#BathukuBadi #బతుకుబడి #PlatesMaking

Комментарии

Информация по комментариям в разработке