#Ninnuvidisiundalenaya

Описание к видео #Ninnuvidisiundalenaya

రచయిత శ్రీ గోపరాజు వేంకట సుబ్బారావు గారు.
నిన్ను విడిచి ఉండలేనయా కైలాస వాసా - శివతత్త్వం
పల్లవి
నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
నిన్ను విడచి ఉండలేనయ్య

చరణం: 1
నిన్ను విడచి ఉండలేను, కన్నా తండ్రి వగుట చేత .. 2
యెన్నఁబోకు నేరములను , చిన్ని కుమారుడనయ్య శివా ఆఆ.....
|| నిన్ను విడిచి ఉండలేనయ్య ||

చరణం: 2
సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, ... 2..
సర్వమునకు ఆర్త నీవు,
పరమ పురుష భవా శివా....
|| నిన్ను విడిచి ఉండలేనయ్య ||

చరణం: 3
వరమ పద్మ బాల శంభో, బిరుదులెన్నో గలవు నీకు
కరుణ తొడ బ్రోవకున్న
బిరుదులన్నీ సున్నాలన్నా
|| నిన్ను విడిచి ఉండలేనయ్య ||

చరణం: 4

శివ మహాదేవ శంకర, నీవే తోడు నీడ మాకు,
కావుమయ్య శరణు శరణు
దేవా దేవా సాంబశివా

నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
నిన్ను విడచి ఉండలేనయ్య , మహా దేవా శంభో
నిన్ను విడచి ఉండలేనయ్య

Комментарии

Информация по комментариям в разработке