పంచతంత్రం కథలు | 1వ భాగము | Panchatantram in Telugu | Rajan PTSK

Описание к видео పంచతంత్రం కథలు | 1వ భాగము | Panchatantram in Telugu | Rajan PTSK

తెలివితేటలు పెంచే కథలు
పంచతంత్రం అనే పేరు అందరూ వినే ఉంటారు. సుమారు రెండు వేల ఐదువందల సంవత్సరాల క్రితంనుండే ఈ పంచతంత్రం అనే గ్రంథం చాలా ప్రసిద్ధిలో ఉంది. ఈ గ్రంథం కథల రూపంలో ఉంటుంది. ప్రధాన పాత్రలన్నీ కూడా సింహం, నక్క, ఎద్దు, కాకి, పాము, కోతి, పావురం, ఎలుక ఇలా పశుపక్ష్యాదుల రూపంలోనే ఉంటాయి. ఈ పంచతంత్రం చదివిన ఎవరైనా సరే తెలివైనవాళ్ళగానే మారతారు. ఎప్పుడు, ఎవరితో ఎలా మాట్లాడాలో, కష్ట సమయాల్లో ఎలా ప్రవర్తించాలో, మంచి మిత్రుల్ని ఎలా సంపాదించుకోవాలో, చెడు స్నేహాలను ఎలా వదిలించుకోవాలో కచ్చితంగా తెలుసుకుంటారు. అంతేకాకుండా అవతలి వారి మాటల్ని, ప్రవర్తనని బట్టి వారి స్వభావాన్ని పసిగట్టగలుగుతారు. అంత గొప్ప గ్రంథం కాబట్టే అనేకానేక దేశ విదేశీభాషల్లోకి ఈ పంచతంత్రం అనువాదమయ్యింది. ఈ పంచతంత్రానికి అసలు ఆ పేరెలా వచ్చిందో, ఆ గ్రంథాన్ని ఎవరు, ఎందుకోసం వ్రాసారో మొదలైన విషయాలన్నీ కూడా కథాగమనంలో భాగంగానే మనకు తెలుస్తాయి. ప్రస్తుతం పుస్తకాల షాపుల్లో పంచతంత్రం పేరుతో రకరకాల కథల పుస్తకాలు అమ్మేస్తున్నారు. సరళత పేరుతో కథల్లో చాలా మార్పులు చేస్తున్నారు. కొత్త కథలు కూడా చేరుస్తున్నారు. అయితే సంస్కృత మూలానికి విధేయంగా ఉన్న అసలు సిసలు పంచతంత్రం కథల్నే మనం మన అజగవలో చెప్పుకోబోతున్నాం. ఈరోజు ముందుగా పంచతంత్రానికి ఉపోద్ఘాతం వంటి కథను చెప్పుకుందాం. ఈ భాగాన్ని వింటే పంచతంత్రంలో ఉన్న ఐదు తంత్రాలలో ఏ తంత్రంలో ఏముందన్న విషయంతో పాటూ ఆ యా తంత్రాలలో ప్రధాన పాత్రల వివరాలు కూడా తెలుస్తాయి.

Комментарии

Информация по комментариям в разработке